అలా జరిగి ఉంటే కశ్మీర్ సమస్య ఉండేదే కాదు: అమిత్ షా

| Edited By: Srinu

Mar 07, 2019 | 5:56 PM

రాజమండ్రి: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాజమండ్రి సభలో ప్రసంగించారు. కశ్మీర్ సమస్య ఇప్పటికీ కొనసాగుతుండటానికి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూనే కారణమని ఆయన ఆరోపించారు. ఆనాడు నెహ్రూ కాకుండా భారత ప్రధానిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అయ్యింటే కశ్మీర్ సమస్య ఉండేదే కాదని అన్నారు. కశ్మీర్ సమస్యకు కారణం ఎవరు అని చెప్పాల్సి వస్తే అది నెహ్రూ తప్ప మరో పేరు ఉండదని షా అన్నారు. భారత దేశం యావత్తు అమర జవాన్లకు […]

అలా జరిగి ఉంటే కశ్మీర్ సమస్య ఉండేదే కాదు: అమిత్ షా
Follow us on

రాజమండ్రి: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాజమండ్రి సభలో ప్రసంగించారు. కశ్మీర్ సమస్య ఇప్పటికీ కొనసాగుతుండటానికి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూనే కారణమని ఆయన ఆరోపించారు. ఆనాడు నెహ్రూ కాకుండా భారత ప్రధానిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అయ్యింటే కశ్మీర్ సమస్య ఉండేదే కాదని అన్నారు. కశ్మీర్ సమస్యకు కారణం ఎవరు అని చెప్పాల్సి వస్తే అది నెహ్రూ తప్ప మరో పేరు ఉండదని షా అన్నారు.

భారత దేశం యావత్తు అమర జవాన్లకు నివాళులర్పిస్తుంటే కాంగ్రెస్ మాత్రం రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. పుల్వామా దాడి తర్వాత ప్రధాని మోడీ షూటింగ్‌లలో పాల్గొన్నారంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు ఇలాంటివేనని చెప్పారు. సరిగ్గా పుల్వామా ఘటన జరిగిన సమయంలోనే మోడీ గారు ఒక ఈవెంట్‌లో ఉన్నారని దాన్ని కాంగ్రెస్ పార్టీ వాడుకుని రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని షా ఆగ్రహం వ్యక్తం చేశారు.