మూడో ప్రపంచ యుద్దం..మోహన్ భగవత్‌ కీలక వ్యాఖ్యలు

|

Feb 16, 2020 | 2:38 PM

ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం దిశగా పయనిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌. గుజరాత్‌ అహ్మదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో..ప్రస్తుతం సమాజంలో హింస, మూర్ఖత్వం, ఉగ్రవాదం, అసంతృప్తి పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో సహా విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. వందేళ్ల క్రితం మనం ఊహించలేని విధంగా దేశం అభివృద్ధి చెందినా..ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరన్నారు. సూపర్‌ పవర్‌ దేశాలైన యూఎస్‌, […]

మూడో ప్రపంచ యుద్దం..మోహన్ భగవత్‌ కీలక వ్యాఖ్యలు
Follow us on

ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం దిశగా పయనిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌. గుజరాత్‌ అహ్మదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో..ప్రస్తుతం సమాజంలో హింస, మూర్ఖత్వం, ఉగ్రవాదం, అసంతృప్తి పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో సహా విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. వందేళ్ల క్రితం మనం ఊహించలేని విధంగా దేశం అభివృద్ధి చెందినా..ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరన్నారు.

సూపర్‌ పవర్‌ దేశాలైన యూఎస్‌, రష్యా, చైనా ..ప్రపంచానికి ఏం చేశాయని ప్రశ్నించారు. తమ స్వార్థపూరిత ఎజెండా కోసం ఇతర దేశాలపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయన్నారు. ప్రపంచ విధ్వంసం కోసం జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారని అన్నారు. మానవులు రోబోలుగా మారకుండా నిరోధించడానికి భారతదేశం ప్రపంచానికి మార్గనిర్దేశం చేయాలన్నారు. బలవంతుడు బలహీనులను అణిచివేస్తున్నాడని..మనం మెరుగైన ప్రపంచంలో జీవిస్తున్నామని అనుకోవడం తప్పన్నారు.