పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలంలో ఏకంగా ఆరు గ్రామాలు ఎన్నికలను బహిష్కరించాయి. తమ ఆరు గ్రామాలు కలిపి ఒకే పంచాయితీగా చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆయా గ్రామాల ప్రజలను ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామాలన్నింటిని ఒకే పంచాయితీగా చేస్తామని 2014లో హామీ ఇచ్చారని.. దానిని అధికారులు ఇంతవరకు నెరవేర్చలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.