పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి బరిలో దిగనున్నాడా..?

|

Mar 13, 2019 | 4:36 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అనే అంశంపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం దాదాపు ఖరారు అయినట్లు వినికిడి. విశాఖ పరిధిలోని గాజువాక నుంచి పవన్ పోటీ చేస్తారని రాజకీయ వర్గాల నుంచి సమాచారం. ఇకపోతే పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి పోటీ చేయడంలో బలమైన కారణం ఉందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఎందుకంటే 2009లో ప్రజారాజ్యం తరుపున మెగాస్టార్ చిరంజీవి అక్కడ నుంచి పోటీ […]

పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి బరిలో దిగనున్నాడా..?
Follow us on

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అనే అంశంపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం దాదాపు ఖరారు అయినట్లు వినికిడి. విశాఖ పరిధిలోని గాజువాక నుంచి పవన్ పోటీ చేస్తారని రాజకీయ వర్గాల నుంచి సమాచారం.

ఇకపోతే పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి పోటీ చేయడంలో బలమైన కారణం ఉందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఎందుకంటే 2009లో ప్రజారాజ్యం తరుపున మెగాస్టార్ చిరంజీవి అక్కడ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అందుకే పవన్ కళ్యాణ్ కూడా అక్కడ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. గాజువాక నియోజకవర్గంలో ప్రధానంగా కాపులు ఎక్కువ ఉండడం.. అక్కడ పవన్ కళ్యాణ్ కు విశేష ఆదరణ కూడా ఉండడంతో ఈ నిర్ణయం పార్టీ కార్యకర్తలు తీసుకున్నారని తెలుస్తోంది. ఈ విషయం అయితే అధికారకంగా బయటి రాలేదు. దరఖాస్తు చేసే సమయంలో కూడా తను ఎక్కడ నుంచి పోటీ చేసేది అనే దాన్ని పార్టీనే డిసైడ్ చేస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇది చూస్తుంటే పార్టీ పవన్ ను గాజువాక నుంచి పోటీ చేయమని డిసైడ్ చేసినట్లు ఉంది.