ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న పరిటాల సునీత..!

|

Mar 13, 2019 | 6:42 PM

ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి మరో వారసుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా టీడీపీ మంత్రి పరిటాల సునీత తన తనయుడు పరిటాల శ్రీరామ్ ను ఎన్నికల బరిలోకి దించాలని భావిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ విషయంపై ఇప్పటికే ఆమె చంద్రబాబుతో చర్చలు కూడా జరిపారట. ఇద్దరికీ టికెట్లు ఇవ్వలేనని, ఒకరికైతే ఇవ్వగలనని చంద్రబాబు స్పష్టం చేసినట్లు సమాచారం. దీనితో తమకు రెండు సీట్లు ఇవ్వకపోతే తాను పోటీ నుంచి […]

ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న పరిటాల సునీత..!
Follow us on

ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి మరో వారసుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా టీడీపీ మంత్రి పరిటాల సునీత తన తనయుడు పరిటాల శ్రీరామ్ ను ఎన్నికల బరిలోకి దించాలని భావిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఈ విషయంపై ఇప్పటికే ఆమె చంద్రబాబుతో చర్చలు కూడా జరిపారట. ఇద్దరికీ టికెట్లు ఇవ్వలేనని, ఒకరికైతే ఇవ్వగలనని చంద్రబాబు స్పష్టం చేసినట్లు సమాచారం. దీనితో తమకు రెండు సీట్లు ఇవ్వకపోతే తాను పోటీ నుంచి తప్పుకుంటానని.. తన బదులుగా రాప్తాడు నుంచి శ్రీరామ్ పోటీ చేస్తాడని సునీత తెలిపారని తెలుస్తోంది.

ఇప్పటికే అనంతపురం జిల్లాలో జే.సీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్ రెడ్డి ఎంపీగా, జే.సీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా తొలిసారి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పరిటాల వారసుడు కూడా పోటీ చేయడంతో అనంతలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి అని విశ్లేషకులు అంటున్నారు.