గుంటూరు జిల్లాలో పెళ్లైన 24 గంటల్లోపే నవ వధువు మరణం : కార‌ణం ?

|

Aug 08, 2020 | 1:33 PM

గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లైన 24 గంటల్లోనే నవ వధువు త‌నువు చాలించింది. వైవాహిక జీవితంపై ఎన్నో ఆశలతో మెట్టినింట అడుగుపెట్టిన ఆమె..పూర్తిగా ఒక్క రోజు కూడా అక్క‌డ గ‌డ‌ప‌కుండానే ప్రాణాలు విడిచింది.

గుంటూరు జిల్లాలో పెళ్లైన 24 గంటల్లోపే నవ వధువు మరణం : కార‌ణం ?
Follow us on
Guntur district bride death : గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లైన 24 గంటల్లోనే నవ వధువు త‌నువు చాలించింది. వైవాహిక జీవితంపై ఎన్నో ఆశలతో మెట్టినింట అడుగుపెట్టిన ఆమె..పూర్తిగా ఒక్క రోజు కూడా అక్క‌డ గ‌డ‌ప‌కుండానే ప్రాణాలు విడిచింది. వివ‌రాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలంలోని ఇరుకుపాలెంకు చెందిన ఆనంద్‌కు… రొంపిచర్ల మండలం మునమాకకు చెందిన భవాని అనే యువ‌తితో పెళ్లి కుద‌ర్చారు పెద్ద‌లు. భవాని టీటీసీ కంప్లీట్ చేసి ఇంటి వ‌ద్దే ఖాళీగా ఉంటుంది. ఆమె కొంతకాలంగా నిమ్ము, ఆయాసం వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ఎదుర్కుంటుంది‌. ఎంగేజ్‌మెంట్ అప్ప‌టికే అయిపోవ‌డంతో.. రెండు కుటుంబాల పెద్ద‌లు ప‌లుసార్లు చర్చించి.. గురువారం ఉదయం ఇరుకుపాలెంలోని చర్చిలో వివాహం జ‌రిపించారు.

సాంప్ర‌దాయం ప్ర‌కారం భవాని పెళ్లి అనంత‌రం అత్తారింటికి వెళ్లింది. అయితే తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆమె శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ప‌డింది. వెంటనే ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఆమెను నర్సరావుపేటలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి త‌ర‌లించారు. అక్కడ డాక్ట‌ర్లు ట్రీట్మెంట్ చేసేందుకు నిరాకరించడంతో గుంటూరు గ‌వ‌ర్న‌మెంట్ ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. డాక్ట‌ర్ వచ్చి చికిత్స అందించేలోపే భవాని ప్రాణాలు విడిచింది. వివాహానికి ముందుగా ఈ నెల 4న క‌రోనా టెస్టు నిర్వహించగా.. ఆమెకు నెగిటివ్‌ వచ్చింది. దీంతో మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బంది కుటుంబానికి అప్పగించారు. అనంత‌రం వారు ఖ‌న‌నం చేశారు. కాగా పెళ్లైన 24 గంటల్లోనే నవ వధువు ఇలా ఆక‌స్మాత్తుగా ప్రాణాలు విడ‌వ‌డం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

 

Read More : మాజీ ఎంపీ నంది ఎల్లయ్య క‌న్నుమూత‌