అమెరికాను కుదిపేస్తున్న ‘బోన్‌లెస్ చికెన్’

| Edited By: Team Veegam

Sep 15, 2020 | 8:14 PM

అమెరికాలో ఓ యువకుడు బోన్‌లెస్ చికెన్ పేరు మార్చాలంటూ కోర్టుకెక్కి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. సంవత్సరాల తరబడి మనం అబద్ధాల్లో బతికేస్తున్నామని, ఇప్పటికైనా బోన్‌లెస్ చికెన్ పేరు మార్చాలని నెబ్రాస్కాకు...

అమెరికాను కుదిపేస్తున్న బోన్‌లెస్ చికెన్
Follow us on

Remove the Name Boneless : చికెన్ సెంటర్‌కు వెళ్లినా.. రెస్టారెంట్‌‌లోకి అడుగు పెట్టగానే.. అక్కడుండేవాడు చదివే మెనూలో ప్రతి ఐటమ్‌కు ముందు బోన్ లెస్ చికెన్ .. వెనక బోన్ విత్ చికెన్ అంటూ  ఓ పాతిక రకాల చికెన్ వంటకాల లిస్టును  మనముందుంచుతాడు. బోన్ లెస్ చికెన్ మొదటి ప్రాధాన్యతలో  చికెన్ ప్రియుల మనను లాగేస్తాడు. వెంటనే అక్కడున్న మెనూలోని ఓ నాలుగైదు రకాలను ఆర్డర్ ఇచ్చేసి.. పుష్టుగా తినేసి.. వాడి వద్ద తిన్న బోన్ లెస్ చికెన్ పకోడీని తెగ మెచ్చుకుని.. వాడు ఇచ్చే కిళ్లీ నోట్లో వేసుకుని మరీ వచ్చేస్తాం.

ఇక్కడే వినియోగదారుడు నిండా మోసపోతున్నాడు అంటూ కోర్టు మెట్లు ఎక్కాడు ఓ అమెరికన్. వారు పెట్టిన పేరులోనే పెద్ద మోసం .. అబద్ధం దాగివుందని కోర్టు ముందు తన వాదనను వినిపించాడు. అతడు వేసిన ప్రశ్నకు జడ్జిగారు కూడా షాక్ తిన్నాడు. ఎందుకంటే మనం అబద్ధంలోనే బతికేస్తున్నాము అంటూ వేసిన  మొదటి ప్రశ్న.. బోన్ లెస్ చికెన్‌లో బోన్ ఉంటుందా..?

అమెరికాలో ఓ యువకుడు బోన్‌లెస్ చికెన్ పేరు మార్చాలంటూ కోర్టుకెక్కి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. సంవత్సరాల తరబడి మనం అబద్ధాల్లో బతికేస్తున్నామని, ఇప్పటికైనా బోన్‌లెస్ చికెన్ పేరు మార్చాలని నెబ్రాస్కాకు చెందిన 27 ఏళ్ల యువకుడు అండెర్ క్రిస్టెన్సన్ లింకోల్న్ సిటీ కౌన్సిల్‌ను ఆశ్రయించాడు.

బోన్‌లెస్ చికెన్‌లో బోన్ ఉంటుందా..? ఇదో అబద్ధం..!

బోన్‌లెస్ చికెన్ వింగ్స్‌ను నిషేధించాలని క్రిస్టెన్సన్ అభ్యర్థించాడు. బోన్‌లెస్ చికెన్ వింగ్స్ అనేవి చికెన్ వింగ్స్ నుంచి రావని, అది బ్రెస్ట్ ప్రాంతం నుంచి వస్తుందని చెప్పుకొచ్చాడు. కాబట్టి అందులో బోన్స్‌ ఉండే అవకాశం లేదని వాదించాడు.

మనం చాలా కాలంగా అబద్ధాల్లో బతికేస్తున్నామని, కాబట్టి బోన్‌లెస్ చికెన్ పేరు మార్చాలని డిమాండ్ చేశాడు. అంతటితో ఆగకుండా..  బోన్‌లెస్ చికెన్‌కు మరో కొన్ని పేర్లను కూడా తానే సూచించాడు. ఆ పేరు బదులుగా.. ‘బఫెలో స్టైల్ చికెన్ టెండర్స్, వెట్ టెండర్స్, సాసీ నగ్స్, ట్రాష్’ వంటి వాటిలో ఏదో ఒక పేరు పెట్టాలని క్రిస్టెన్సన్ కౌన్సిల్‌ను అభ్యర్థించాడు. ఇతడి అభ్యర్థనను విన్న కోర్టు మరో రోజుకు వాయిదా వేసింది. చూడాలి ఇతడు కోర్టును ఎంతవరకు మెప్పిస్తాడో అంటున్నారు అమెరికన్లు.