అయోధ్య తీర్పు: చేయకూడనివి ఏంటంటే..?

| Edited By:

Nov 09, 2019 | 10:44 AM

వివాదస్పద అయోధ్య రామజన్మభూమిపై మరికొన్ని గంటల్లో సుప్రీం తీర్పు వెలువడనుంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం తీర్పు వెల్లడించనుంది. అయోధ్య తీర్పు నేపథ్యంలో న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ పలు సూచనలు చేసింది. తీర్పు నేపథ్యంలో వార్తా ప్రసార మాధ్యమాలు చేయకూడనివి.. *తీర్పుకు ముందు.. అది ఎలా ఉండొచ్చు అని ఊహాజనిత వ్యాఖ్యలు ఉండరాదు. * తీర్పు తర్వాత.. ఎలాంటి […]

అయోధ్య తీర్పు: చేయకూడనివి ఏంటంటే..?
Follow us on

వివాదస్పద అయోధ్య రామజన్మభూమిపై మరికొన్ని గంటల్లో సుప్రీం తీర్పు వెలువడనుంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం తీర్పు వెల్లడించనుంది. అయోధ్య తీర్పు నేపథ్యంలో న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ పలు సూచనలు చేసింది.

తీర్పు నేపథ్యంలో వార్తా ప్రసార మాధ్యమాలు చేయకూడనివి..

*తీర్పుకు ముందు.. అది ఎలా ఉండొచ్చు అని ఊహాజనిత వ్యాఖ్యలు ఉండరాదు.
* తీర్పు తర్వాత.. ఎలాంటి రెచ్చగొట్టే పదాలు కానీ, వ్యాఖ్యలు కానీ చేయకూడదు.
* బాబ్రీ మసీదు కూల్చివేత దృశ్యాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు.
* తీర్పు తర్వాత నిరసనలు…సంబరాలకు సంబంధించిన వాటిని చూపించకూడదు.
* మతపరమైన అంశాల ప్రస్తావన విషయంలో.. అత్యంత జాగ్రత్త వహించాలి.
* తీర్పుని.. తీర్పులా చెప్పాలి తప్ప.. ఉపమానాలు, ఉపమేయాలు వాడకూడదు.
* తీర్పునకు సంబంధించి.. న్యాయమూర్తులపై ఎలాంటి వ్యాఖ్యానాలు చేయకూడదు.
* తీర్పుపై రెచ్చగొట్టే విధంగా ఎలాంటి ప్రసారాలు చేయరాదు.

శాంతి భద్రతల దృష్ట్యా..కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు..బ్రాడ్ కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ  ఈ సూచనలు చేసింది. అందుకు న్యూస్ ఛానల్స్, వార్తా పత్రికలు సహరించాలని కోరింది.