Man luckily escapes when two lorries hit each other: భూమ్మీద నూకలుంటే ఎలాంటి విపత్కర పరిస్థితి నుంచైన బతికిపోతాం అనడానికి చక్కని ఉదాహరణ బుధవారం తెల్లవారు జామున సంగారెడ్డి శివారులో జరిగింది. ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా.. అత్యంత సమీపంలోనే రెండు లారీలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. తన వెనుక తరుముకొస్తున్న రెండు లారీల గురించి తెలియని సదరు వ్యక్తి కూల్‌గా రోడ్డు దాటుతుండగా.. రెండు లారీలు ఒకదానిని మరొకటి ఢీ కొన్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇపుడు వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి: జగన్ ప్రభుత్వానికి అమరావతి హైకోర్టు షాక్
సంగారెడ్డి శివారులోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో లారీల బీభత్సం సృష్టించాయి. ఒకే వైపు వెళ్తున్న రెండు లారీలు ఢీ కొన్నాయి. రెండు లారీలు తరుముకొస్తున్న విషయం గమనించని సదరు వ్యక్తి రోడ్డు డివైడర్ దాటేందుకు వెళుతుండగా… రెండు లారీలు ఒకదానికి మరొకటి ఢీకొని ఆ వ్యక్తి వెళుతున్న వైపే దూసుకొచ్చాయి. అయితే.. ఆ వ్యక్తి రెండు లారీల మధ్య నుంచి ఆ వ్యక్తి అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాడు.
ఇదీ చదవండి: తెలంగాణ బీజేపీ నేతల్లో కొత్త మీమాంస
బుధవారం తెల్లవారుజామున పోతిరెడ్డి పల్లి చౌరస్తాలో ఓ వ్యక్తి రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో అటువైపునకు ఓ లారీ వస్తోంది. ఆ వ్యక్తి వెనుక నుంచి మరో లారీ వచ్చింది. రెండు లారీలు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. చివరి నిమిషయంలో గమనించిన వ్యక్తి రెండు లారీల మధ్య నుంచి ఎలాంటి గాయాలు లేకుండా అదృష్టవశాత్తు బతికి బయట పడ్డాడు. ఎలాంటి ప్రాణ నష్టం జరుగకపోవడంతో పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. సంఘటన ఆ ప్రాంతంలో ఒక్కసారి భయాందోళన కలిగించింది. ఈ యాక్సిడెంట్ వీడియో వైరల్‌గా మారింది.
ఇదీ చదవండి: ఐటీ అధికారులకు నయీం ఫ్యామిలీ షాక్