మహారాష్ట్రలో రాజకీయాలు గంటగంటకి మారిపోతున్నాయి. అధికారం దక్కించుకునేందుకు పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో 56 సీట్లు గెలుచుకున్న శివసేన ఇప్పుడు కింగ్ మేకర్‌గా మారింది. సేన నాయకులు సీఎం పీఠం విషయంలో షేరింగ్ కావాలంటూ మెండిపట్టు వీడకపోవడంతో బీజేపీ కొత్త ప్లాన్‌కు తెరలేపింది.
ఇప్పటికే పదవీకాలం ముగిసిపోవడంతో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం పదవికి రాజీనామా చేసి అపద్దర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఎన్నికల ఫలితాలు వచ్చి 15రోజులు గడవడంతో పాటు.. అసెంబ్లీ గడువు కూడా ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ కోటాలో బీజేపీని అధికారం ఏర్పాటు చేయమని ఆహ్వానిస్తూ గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాగా అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలంటే 145 మంది ఎమ్మెల్యేలు అవసరం. నవంబర్ 11 సాయంత్రం వరకు డెడ్‌లైన్ ఉంది. ఈలోపు పార్టీల మధ్య పలు సంచలన నిర్ణయాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Maharashtra Governor Bhagat Singh Koshyari has invited the single largest party BJP to form the government pic.twitter.com/VnIXuzjr22
— ANI (@ANI) November 9, 2019
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 21న జరిగాయి. ఫలితాలు 24న ప్రకటించగా..బీజేపీ 105 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. దీంతో ఫడ్నవీస్‌ను బీజేపీ శాసననభాపక్షనేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అక్టోబర్ 31న ఎన్నుకున్నారు.