
కరోనాతో కలిసి జీవించాలన్న వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల హెచ్చరికలతో అన్ని సంస్థలు ఆరోగ్య నియమాలపై దృష్టి సారించాయి. భారత్ లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ఉబర్ క్యాబ్స్ ప్రయాణాలు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికలు, డ్రైవర్లకు మార్గదర్శకాలు విడుదల చేసింది. పరిమిత సంఖ్యలో ప్రణాణికులను అనుమతినిస్తూ.. ఉబెర్ పూల్ (ఫేరింగ్)ను కూడా రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. అంతేకాకుండా డ్రైవర్ మాస్క్ ధరించకుంటే.. ఏ క్షణంలోనే ప్రయాణాన్ని రద్దు చేసుకునే అవకాశాన్ని ప్రయాణికులకు కల్పిస్తున్నారు.
* ప్రయాణం అరంభానికి ముందు మూడు అంచెల తనిఖీ విధానం.
* ముందు సీట్లో ప్రయాణికులను అనుమతించరు. వెనుక సీటుకు మాత్రమే పరిమితం.
* ఎయిర్ కండిషన్ ను ఫ్రెష్ ఎయిర్ మోడ్ లో మాత్రమే ఉపయోగించుకోవాలి.
* ప్రయాణించేటప్పుడు బ్యాగుల నిర్వహణ ప్రయాణికుడే చూసుకోవాలి.
* ముంబైలో కచ్చితంగా కొవిడ్ హబ్ యాప్ వేసుకోవాలి.
* డ్రైవర్లు మాస్క్ ఎలా ధరించాలి. కార్డును ఉపయోగించాలని ఉబెర్ కంపెనీ శిక్షణనిస్తుంది.
* లాగిన్ అయిన ప్రతిసారి డ్రైవర్ ముఖానికి తప్పనిసరిగా మాస్క్ ఉండాలి.
* డ్రైవర్ మాస్క్ వేసుకున్న తర్వాతే ఫోటోను అప్ లోడ్ చేయాలి. ఇలా చేయకపోతే ప్రయాణం స్టార్ట్ అవ్వదు.
* ప్రతి ప్రయాణానికి ముందు కారును కచ్చితంగా శానిటైజ్ చేయాలి.
* సీటు, డోర్, హ్యాండిల్స్, అడ్జస్టర్ వంటి వాటిని తప్పనిసరిగా శుభ్రం చేయాలి.
పైన సూచించిన వాటిలో ఏదీ నచ్చకపోయిన ప్రయాణికులు తమ జర్నీని రద్దు చేసుకునే విధంగా ఉబెర్ మార్గదర్శకాలను సిద్ధం చేసింది.