ఓపెన్ నాలాలపై సర్కారు సీరియస్.. నవీన్ భార్యకి ప్రభుత్వ ఉద్యోగం

|

Sep 22, 2020 | 11:00 AM

మొన్న పన్నెండేళ్ల బాలిక సుమేధ, నిన్న నలభై ఐదేళ్ల నవీన్.. భారీ వర్షాల కాలంగా ఓపెన్ నాలాలు మృత్యుకూపాలుగా మారటంపై కేసీఆర్ సర్కారు సీరియస్ అయింది. ఈ రెండు ఘటనలపై తీవ్ర ఆగ్రహాన్ని వెలిబుచ్చి ఓపెన్ నాలాలు తక్షణమే మూసివెయ్యాలని ఆదేశాలిచ్చింది. దీంతో భాగ్యనగరంలో ఓపెన్ నాలాలను క్లోజ్ చేసేపనిలో పడ్డారు జిహెచ్ఎంసి అధికారులు. కాగా, సరూర్ నగర్ చెరువు లో కొట్టుకు పోయిన నవీన్ కుమార్ మృత దేహానికి నేడు పోస్ట్ మార్టం నిర్వహించారు. నవీన్ […]

ఓపెన్ నాలాలపై సర్కారు సీరియస్.. నవీన్ భార్యకి ప్రభుత్వ ఉద్యోగం
Follow us on

మొన్న పన్నెండేళ్ల బాలిక సుమేధ, నిన్న నలభై ఐదేళ్ల నవీన్.. భారీ వర్షాల కాలంగా ఓపెన్ నాలాలు మృత్యుకూపాలుగా మారటంపై కేసీఆర్ సర్కారు సీరియస్ అయింది. ఈ రెండు ఘటనలపై తీవ్ర ఆగ్రహాన్ని వెలిబుచ్చి ఓపెన్ నాలాలు తక్షణమే మూసివెయ్యాలని ఆదేశాలిచ్చింది. దీంతో భాగ్యనగరంలో ఓపెన్ నాలాలను క్లోజ్ చేసేపనిలో పడ్డారు జిహెచ్ఎంసి అధికారులు. కాగా, సరూర్ నగర్ చెరువు లో కొట్టుకు పోయిన నవీన్ కుమార్ మృత దేహానికి నేడు పోస్ట్ మార్టం నిర్వహించారు.

నవీన్ కుమార్ భార్య కి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు, సరూర్ నగర్ చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కాలనీ వాసుల డిమాండ్ చేస్తున్నారు. భారీ వరద ప్రవాహానికి ఆదివారం సాయంత్రం నాలలో కొట్టుకుపోయి సరూర్ నగర్ చెరువు లో నిన్న మధ్యాహ్నం నవీన్ మృత దేహం తేలింది.