కరోనాతో చనిపోతే ప్రభుత్వ ఉద్యోగం: సీఎం మమతా

|

Jul 15, 2020 | 9:08 PM

కరోనా కట్టడిలో విధులు నిర్వహిస్తున్న ఫ్రంట్ వారియర్స్ సైతం కరోనా బారినపడి ప్రాణాలొదులుతున్నారు. దీంతో చాలా మంది ఉద్యోగులు పనులు చేసేందుకు భయపడిపోతున్నారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా కల్పిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు.

కరోనాతో చనిపోతే ప్రభుత్వ ఉద్యోగం: సీఎం మమతా
Follow us on

కరోనా వైరస్ దేశంలో రోజు రోజుకు విజృంభిస్తూనే ఉంది. కరోనా కట్టడిలో విధులు నిర్వహిస్తున్న ఫ్రంట్ వారియర్స్ సైతం కరోనా బారినపడి ప్రాణాలొదులుతున్నారు. దీంతో చాలా మంది ఉద్యోగులు పనులు చేసేందుకు భయపడిపోతున్నారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా కల్పిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కరోనాతో మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. బుధవారం అధికారులతో జరిగిన సమావేశంలో ఆమె ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇటీవల వరుస ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణాలు వదులుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.