శాంతి కామికుడిపై చిందిన రక్తం..ఏసు సాక్షిగా మారణకాండ

|

Apr 21, 2019 | 8:53 PM

శాంతి కామికుడిగా భావించే ఏసుపై చిందిన రక్తం శ్రీలంకలోని మారణకాండకు అద్దం పడుతుంది. ఈ దశాబ్దంలోనే అత్యంత దారుణమైన మారణకాండతోొ ఉగ్రవాదులు పేట్రేగిపోయారు.  ఆత్మాహుతి దళ సభ్యులు కొలంబోలోని చర్చిలు, స్టార్ హోటళ్లను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 210 మందికి పైగా మరణించగా, 500 మంది తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నారు. అయితే, చర్చిల్లో ఎంతో శక్తిమంతమైన బాంబులతో పేలుళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఓ చర్చిలో ఉన్న ఏసుక్రీస్తు విగ్రహం […]

శాంతి కామికుడిపై చిందిన రక్తం..ఏసు సాక్షిగా మారణకాండ
Follow us on

శాంతి కామికుడిగా భావించే ఏసుపై చిందిన రక్తం శ్రీలంకలోని మారణకాండకు అద్దం పడుతుంది. ఈ దశాబ్దంలోనే అత్యంత దారుణమైన మారణకాండతోొ ఉగ్రవాదులు పేట్రేగిపోయారు.  ఆత్మాహుతి దళ సభ్యులు కొలంబోలోని చర్చిలు, స్టార్ హోటళ్లను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 210 మందికి పైగా మరణించగా, 500 మంది తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నారు. అయితే, చర్చిల్లో ఎంతో శక్తిమంతమైన బాంబులతో పేలుళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది.
ఓ చర్చిలో ఉన్న ఏసుక్రీస్తు విగ్రహం కూడా రక్తసిక్తమైపోయింది. భక్తుల తాలూకు రక్తం, మాంస ఖండాలు ఎగిరివచ్చి ఏసు విగ్రహంపై పడ్డాయి. ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే ప్రార్థనమందిరాలు ఇప్పుడు నెత్తురోడాయి. ఎక్కడ చూసినా రక్తపు మడుగులు, ఛిద్రమైన శరీర అవయవాలు దర్శనమిస్తున్నాయి. కాగా దేశ వ్యాప్తంగా శ్రీలంక ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది.