AP CM Jagan launched a new app to curb poll irregularities: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల అక్రమాలపై దృష్టి పెట్టారు. అందుకోసం ప్రత్యేక చర్యలకుపక్రమించారు. శనివారం ఎన్నికల అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
ఎన్నికల్లో అక్రమమద్యం, డబ్బు పంపిణీ వంటి అక్రమాల నివారణకు ప్రత్యేక మొబైల్ యాప్ తయారు చేయించారు సీఎం జగన్. శనివారం తన తాడేపల్లి నివాసంలో నిఘా మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు. నిఘా మొబైల్ యాప్ సహాయంతో స్ధానిక సంస్ధల ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్టు వేయాలని సీఎం ఆదేశించారు.
మద్యం, డబ్బు పంపిణీతో పాటు ఎలాంటి అక్రమాలపైనైనా నిఘా యాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం వుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెల్లడించారు. నిఘా మొబైల్ యాప్ సామాన్యుడి చేతిలో అవినీతిపై అస్త్రంగా మారనుందని జగన్ అంటున్నారు. ఎవరైనా ఈ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించామని, ఎక్కడ అక్రమాలు కనిపించినా వెంటనే ఈ నిఘా మొబైల్ యాప్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని జగన్ చెబుతున్నారు. ఈ ఫిర్యాదులు నేరుగా సెంట్రల్ కంట్రోల్ రూంకు చేరే ఏర్పాటు చేశామని అన్నారాయన.