ఇండియా ….40 వేలకు చేరువలో కరోనా కేసులు..

| Edited By: Anil kumar poka

May 03, 2020 | 5:23 PM

ఇండియాలో కరోనా కేసులు 40 వేలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 2,644 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 1301 కి పెరిగింది. ఒక్క రోజులో 83 మంది రోగులు మృతి చెందారు. కేవలం మహారాష్ట్రలోనే 12,296 కేసులు నమోదు కాగా...

ఇండియా ....40 వేలకు చేరువలో కరోనా కేసులు..
Follow us on

ఇండియాలో కరోనా కేసులు 40 వేలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 2,644 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 1301 కి పెరిగింది. ఒక్క రోజులో 83 మంది రోగులు మృతి చెందారు. కేవలం మహారాష్ట్రలోనే 12,296 కేసులు నమోదు కాగా.. గుజరాత్ లో 5,054, ఢిల్లీలో 4122, తమిళనాడులో 2,757, ఏపీలో 1525, తెలంగాణలో 1063, రాజస్థాన్ లో 2,770, యూపీలో 2487 కేసులు నమోదైనట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మిగతా రాష్ట్రాల్లో ఇవి సుమారు వెయ్యిలోపే ఉన్నట్టు ఈ శాఖ పేర్కొంది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 34 లక్షలకు పెరిగాయి. ఒక్క అమెరికాలోనే 11 లక్షల కేసులు నమోదు కాగా.. సుమారు 66 వేల మంది మరణించారు. మొత్తం ప్రపంచ దేశాల్లో మరణించిన వారి సంఖ్య 2.43 లక్షలకు చేరింది. అమెరికాలో లాక్ డౌన్ ని వ్యతిరేకిస్తున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని, లాక్ డౌన్ విధింపు వల్ల ప్రయోజనం లేదని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారని  ఓ సర్వే పేర్కొంది.