ట్రెయినీ ఐఎఫ్‌ఎస్‌కి కరోనా పాజిటివ్..

| Edited By:

Mar 30, 2020 | 4:53 PM

కరోనా మహమ్మారి ఎవర్నీ వదిలిపెట్టట్లేదు. ప్రపంచ దేశాలన్నింటిని ఈ వైరస్ చుట్టుముట్టిన విషయం తెలిసిందే. తాజాగా మనదేశంలో కూడా దీని వ్యాప్తి పెరుగుతుండటంతో.. ఈ మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తరాఖండ్‌లో ఓ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్‌ఎస్‌)కు చెందిన ట్రెయినీకి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. ఈ సంఘటన రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో వెలుగుచూసింది. తొలుత ముగ్గురు ఐఎఫ్ఎస్ ట్రెయినీలకు కరోనా లక్షణాలున్నాయని గమనించి.. వారికి […]

ట్రెయినీ ఐఎఫ్‌ఎస్‌కి కరోనా పాజిటివ్..
Follow us on

కరోనా మహమ్మారి ఎవర్నీ వదిలిపెట్టట్లేదు. ప్రపంచ దేశాలన్నింటిని ఈ వైరస్ చుట్టుముట్టిన విషయం తెలిసిందే. తాజాగా మనదేశంలో కూడా దీని వ్యాప్తి పెరుగుతుండటంతో.. ఈ మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తరాఖండ్‌లో ఓ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్‌ఎస్‌)కు చెందిన ట్రెయినీకి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. ఈ సంఘటన రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో వెలుగుచూసింది. తొలుత ముగ్గురు ఐఎఫ్ఎస్ ట్రెయినీలకు కరోనా లక్షణాలున్నాయని గమనించి.. వారికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో పాజిటివ్ వచ్చిన ఆ ఐఎఫ్ఎస్ ట్రెయినీని ఐసోలేషన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.