జమ్మూ ఎయిర్‌పోర్టులో బ్యాగ్ కలకలం

శ్రీనగర్‌ : జమ్మూ ఎయిర్‌పోర్టులో ఓ బ్యాగ్ కలకలం సృష్టించింది. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద బ్యాగును గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. బాంబు నిర్వీర్య బృందం.. బ్యాగులో ఉన్న వస్తువులను బయటకు తీసి పరిశీలించారు. బ్యాగులో ఐఈడీ పేలుడు పదార్ధాలతో పాటుగా.. బ్యాటరీలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు ప్రయాణికులను అప్రమత్తం చేసి.. భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా నిన్న జమ్మూ బస్టాండ్‌లో గ్రనేడ్‌ పేలడంతో […]

జమ్మూ ఎయిర్‌పోర్టులో బ్యాగ్ కలకలం

Edited By:

Updated on: Mar 08, 2019 | 4:45 PM

శ్రీనగర్‌ : జమ్మూ ఎయిర్‌పోర్టులో ఓ బ్యాగ్ కలకలం సృష్టించింది. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద బ్యాగును గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. బాంబు నిర్వీర్య బృందం.. బ్యాగులో ఉన్న వస్తువులను బయటకు తీసి పరిశీలించారు. బ్యాగులో ఐఈడీ పేలుడు పదార్ధాలతో పాటుగా.. బ్యాటరీలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు ప్రయాణికులను అప్రమత్తం చేసి.. భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా నిన్న జమ్మూ బస్టాండ్‌లో గ్రనేడ్‌ పేలడంతో 32 మంది గాయపడిన విషయం తెలిసిందే. వీరిలో నిన్న ఒకరు మృతి చెందగా, చికిత్స పొందుతూ ఇవాళ మరొకరు మృతి చెందారు.