మన దేశంలో ప్రవహించే పవిత్ర గంగానది గురించి తెలియరువారుండరు. గంగ పవిత్రత గురించి కూడా అనేక కథలు మనం వింటుంటాం. కరోనా లాక్‌డౌన్ కారణంగా గంగానదిలో కాలుష్యం చాలా తగ్గింది. ఇప్పుడు గంగానదిలో చాలా ప్రదేశాల్లో నీటిని డైరెక్టుగా తాగొచ్చని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డ్ (CPCB) తెలిపింది. ఈ క్రమంలోనే కరోనా వైరస్ కట్టడికి గంగానది నీటితో పరిష్కారం దొరుతుందనే ప్రతిపాదనలు వస్తున్నాయి.
భారత వైద్య పరిశోధనా మండలి (ICMR)కి ఓ ప్రతిపాదన వచ్చింది. దాని సారాంశం మేరకు గంగానది నీటితో కరోనా వైరస్‌పై క్లినికల్ ట్రయల్స్ జరపాలని అందులో పేర్కొన్నారు. గంగానదికి ఉన్న ప్రత్యేక లక్షణాల వల్ల కరోనా వైరస్‌ను చంపగలదన్నది ఆ ప్రతిపాదన చేసిన వారి ఉద్దేశం. జలశక్తి మంత్రిత్వ శాఖలోని గంగా శుద్ధి జాతీయ మిషన్ (NMCG) ఈ ప్రతిపాదన తెచ్చింది. ఆర్మీలో రిటైర్ అయిన వారు ఏర్పాటు చేసుకున్న అత్యుల్య గంగ అనే సంస్థ ఈ రిక్వెస్ట్ చేయడంతో… NMCG కూడా ప్రతిపాదన తెచ్చింది. ఏదో ఊహాకల్పితంగా ఈ ప్రతిపాదన తీసుకురాలేదట. ఇందుకు బలమైన కారణం కూడా ఉందని చెప్పారు.