నాకు ఆ అర్హత లేదు: ఇమ్రాన్ ఖాన్

|

Mar 04, 2019 | 4:39 PM

ఇస్లామాబాద్: తనకు నోబెల్ శాంతి బహుమతి పొందే అర్హత లేదని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ అన్నారు. భారత్ వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్‌ను భారత్‌కు అప్పగించినందున ఇమ్రాన్ ఖాన్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ ఆ దేశ పార్లమెంటులో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గత వారం పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరీ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సోషల్ మీడియాలో కూడా ఆ దేశస్థులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై ఇమ్రాన్ […]

నాకు ఆ అర్హత లేదు: ఇమ్రాన్ ఖాన్
Follow us on

ఇస్లామాబాద్: తనకు నోబెల్ శాంతి బహుమతి పొందే అర్హత లేదని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ అన్నారు. భారత్ వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్‌ను భారత్‌కు అప్పగించినందున ఇమ్రాన్ ఖాన్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ ఆ దేశ పార్లమెంటులో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గత వారం పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరీ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

సోషల్ మీడియాలో కూడా ఆ దేశస్థులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై ఇమ్రాన్ ఖాన్ స్వయంగా స్పందించారు. కాశ్మీర్ ప్రజలు కోరుకుంటున్న విధంగా ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న కాశ్మీర్ వివాదాన్ని ఈ ఉప ఖండంలో లేకుండా చేసి, మానవాభివృద్ధికి దారి చూపించిన వారే నోబెల్ శాంతి బహుమతికి అర్హులు అని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

ఆ దేశ సోషల్ మీడియాలో డిమాండ్ వచ్చిన సంగతి భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్‌ను విడుదల చేయడంతో భారత్, పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు సర్దుకున్నాయని, శాంతిని ప్రోత్సహించే చర్యలు తీసుకున్నందుకు ఇమ్రాన్‌కు నోబెల్ ఇవ్వాలంటూ .

దానిపై ఇమ్రాన్ మాట్లాడుతూ..‘కశ్మీర్ ప్రజల ఇష్టాలకు అనుగుణంగా ఎన్నో ఏళ్లుగా నలుగుతోన్న కశ్మీర్‌ వివాదాన్ని పరిష్కరించేవారు, ఉపఖండంలో శాంతి, మానవాభివృద్ధికి దారి చూపించే వారే నోబెల్‌ శాంతి బహుమతికి అర్హులు’ అని ట్విటర్ వేదికగా తన అనర్హతను ప్రకటించారు. గత వారం పాక్‌ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌధరీ ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. తమ ప్రధాని నోబెల్ బహుమతికి అర్హుడంటూ ఇమ్రాన్‌ మద్దతుదారులు ‘నోబెల్‌పీస్‌ఫర్ఇమ్రాన్‌ఖాన్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను తెగ షేర్ చేశారు.