మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్‌బస్ 321 విమానం ఇంజిన్‌లో పక్షులు చిక్కుకోవడంతో సమీపంలో ఉన్న మొక్కజొన్న తోటలో ఫ్లైట్‌ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు పైలట్లు. విమానంలో 223 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 23 మందికి గాయాలయ్యాయి. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. యురల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంగా దీన్ని గుర్తించారు. దీనిపై ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి స్పందించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, పైలట్ సమయస్ఫూర్తి వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపారు. హుకోవ్‌స్కీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కిలోమీటరు దూరంలో ఈఘటన చోటు చేసుకుంది. అయితే విమానం ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్తుందో వివరాలు తెలియరాలేదు. క్షేమంగా ల్యాండవడంతో ప్రయాణికులతో పాటు ఎయిర్‌పోర్టు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై ఏవియేషన్ ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
#Russia: A-321 of Ural airlines crashlanded near Zhukovskiy of Moscow region after bird strike. 10 wounded. Piliots managed to land a plane in the field https://t.co/r2XoFs37Wt pic.twitter.com/JHRpOOtH9g
— Liveuamap (@Liveuamap) August 15, 2019