#ghmc-elections గ్రేటర్ పోలింగ్ ప్రారంభం.. కరోనా నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు.. రద్దీ నివారణకు చర్యలు

|

Dec 01, 2020 | 7:16 AM

యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉత్కంఠకు గురి చేసేలా జరుగుతున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అత్యంత పకడ్బందీ ఏర్పాట్ల మధ్య 9 వేలకు పైగా ..

#ghmc-elections గ్రేటర్ పోలింగ్ ప్రారంభం.. కరోనా నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు.. రద్దీ నివారణకు చర్యలు
Follow us on

GREATER POLLING STARTED: యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉత్కంఠకు గురి చేసేలా జరుగుతున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అత్యంత పకడ్బందీ ఏర్పాట్ల మధ్య 9 వేలకు పైగా పోలింగ్ స్టేషన్లలో ఓట్లు వేసేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో ప్రత్యేకంగా తీసుకున్న ఏర్పాట్లు చేశారు.

పోలింగ్ స్టేషన్ల దగ్గర శానిటైజర్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచి… రద్దీని నివారించే ప్రయత్నాలు చేశారు. పలువురు ప్రముఖులు పోలింగ్ ప్రారంభానికి ముందే తమ పోలింగ్ స్టేషన్లకు చేరుకోవడం కనిపిస్తోంది.

మరో వైపు గ్రేటర్ ఎన్నికలకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 50 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు చేశారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలకు కేంద్ర బలగాలను తరలించారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా…ఓటర్లు ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్‌ల పరిధిలోని అన్ని పోలింగ్‌ బూత్‌లు, చెక్‌పోస్టుల దగ్గర గట్టి భద్రత ఏర్పాటు చేశారు. అడుగడుగునా పోలీసులు మోహరించారు. నగరం నిఘా నీడలో ఉంది. పోలీసులు సిటీని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ను అష్టదిగ్బంధం చేశారు. 9,101 పోలింగ్ స్టేషన్లకు గాను.. పది వేలకు పైగా పోలీసు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు.

ALSO READ: గ్రేటర్‌లో విజయం ఎవరిదో?