తెలుగు ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ షో మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే టీమ్ సభ్యులు బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లారు. షూటింగ్ ఒక రోజు ముందు జరుగుతుంది కాబట్టి వీరు ముందుగానే హౌస్‌లోకి ఎంటరయ్యారు. బిగ్‌బాస్ సీజన్ 3 గతంలో ఎన్నడూ లేనన్ని వివాదాల నడుమ టీవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే రోజుకో కొత్త మలుపులు తిరుగుతున్న ఈ రియాలిటీ షోపై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అసలు ఈ మూడో సీజన్ జరుగుతుందా? లేదా? అనే సందేహాలు జనాల మెదళ్లను తొలిచేశాయి.
అటు మానవహక్కుల సంఘం, ఇటు హైకోర్టులో వేసిన పిటిషన్లు, మరోపక్క ఓయూ జేఏసీ నుంచి హెచ్చరికలు. బిగ్‌బాస్ చుట్టూ ఇంట ఉచ్చుబిగుసుకున్న నేపథ్యంలో బిగ్‌బాస్ షో టీమ్ హైకోర్టును ఆశ్రయించడం అక్కడ టీమ్‌కు ఊరట కలగడం వంటి సంఘటనలు జరిగినా.. చివరికి ఏమవుతుందో తెలియని ఉత్కంఠ వేధించింది. ఈ పరిస్థితిలో అన్ని రూమర్స్‌ను కొట్టి పారేస్తూ మరికొన్ని గంటల్లో బిగ్‌బాస్ ఆడియన్స్ ముందుకు రానుంది.
అటు ఆల్‌మోస్ట్ 14 మంది కంటెస్టెంట్ల జాబితా కూడా ఇప్పటికే సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అయితే చాల వరకు సోషల్ మీడియాలో సెలబ్రిటీలే బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్తున్నారు. యాంకర్ శ్రీముఖి, తీన్మార్ సావిత్రి, నటి హేమ, టీవీ9 జాఫర్.. ఇలా చాలమంది కన్‌ఫామ్ అయిపోయారు. ఎన్నో వివాదాలను తోసుకుంటూ టీవీ ప్రేక్షకుల ముందుకు వస్తున్న బిగ్‌బాస్ 3..గతంలో కంటే ఎంత పాపులర్ అవుతుందో చూడాలి.