ఎన్నికల సంస్కర్త, మాజీ సీఈసీ టీఎన్ శేషన్ ఇకలేరు

|

Nov 11, 2019 | 5:26 AM

దేశ ఎన్నికల కమీషనర్‌గా పనిచేసి..పలు విప్లవాత్మక  మార్పులు తీసుకువచ్చిన టీఎన్ శేషన్(87) కన్నుమూశారు. చాలాకాలం నుంచి అనారోగ్యంగా బాధపడుతోన్న ఆయన ఆదివారం రాత్రి చెన్నైలో కార్డియాక్ అరెస్ట్‌తో తుదిశ్వాస విడిచారు. 1990 డిసెంబర్ 12 నుంచి 1996 డిసెంబర్ 11 వరకు ఆయన భారత ఎన్నికల కమీషనర్‌గా పనిచేశారు. ఎన్నికల నిబంధనలు కఠినతరం చేసి..రాజకియాల్లో ప్రక్షాళన దిశగా ఆయన చేసిన సంస్కరణలు నేటికీ మరవలేనివి. తాను అందించిన సేవలకుగానూ 1996లో శేషన్‌ను రామన్ మెగసెసే అవార్డు వరించింది. […]

ఎన్నికల సంస్కర్త, మాజీ సీఈసీ టీఎన్ శేషన్ ఇకలేరు
Follow us on

దేశ ఎన్నికల కమీషనర్‌గా పనిచేసి..పలు విప్లవాత్మక  మార్పులు తీసుకువచ్చిన టీఎన్ శేషన్(87) కన్నుమూశారు. చాలాకాలం నుంచి అనారోగ్యంగా బాధపడుతోన్న ఆయన ఆదివారం రాత్రి చెన్నైలో కార్డియాక్ అరెస్ట్‌తో తుదిశ్వాస విడిచారు. 1990 డిసెంబర్ 12 నుంచి 1996 డిసెంబర్ 11 వరకు ఆయన భారత ఎన్నికల కమీషనర్‌గా పనిచేశారు. ఎన్నికల నిబంధనలు కఠినతరం చేసి..రాజకియాల్లో ప్రక్షాళన దిశగా ఆయన చేసిన సంస్కరణలు నేటికీ మరవలేనివి. తాను అందించిన సేవలకుగానూ 1996లో శేషన్‌ను రామన్ మెగసెసే అవార్డు వరించింది. 1955 బ్యాచ్‌కు ఐఏఎస్ అధికారి అయిన టీఎన్ శేషన్…1989లో కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా సేవలు అందించారు. 1932లో కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో జన్మించిన శేషన్ పూర్తి పేరు తిరునళ్లై నారాయణ అయ్యర్ శేషన్.