15 ఏళ్ళ అమ్మాయిపై 22 రోజులపాటు అఘాయిత్యం

|

Oct 15, 2020 | 4:08 PM

పదిహేనేళ్ళ మైనర్ బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఒకసారి, రెండుసార్లు కాదు.. ఏకంగా 22 రోజుల పాటు నిర్బంధించి పలు మార్లు అత్యాచారం చేశారు. చిత్రహింసలకు గురి చేశారు.

15 ఏళ్ళ అమ్మాయిపై 22 రోజులపాటు అఘాయిత్యం
Follow us on

Fifteen years girl raped for 22 days: పదిహేనేళ్ళ మైనర్ బాలికపై ఇద్దరు వ్యక్తులు ఏకంగా 22 రోజుల పాటు అత్యాచారం చేసి చిత్రహింసలకు గురి చేసిన దారుణ ఉదంతం ఒడిశాలోకి కటక్‌లో జరిగింది. బాలికను నిర్బంధించిన విషయం స్థానికులు పోలీసులకు తెలియజేయడంతో వారు ఆమెను రక్షించి, రేపిస్టులిద్దరినీ అరెస్టు చేశారు.

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు ఆనుకుని వున్న కటక్‌లోని చౌలియాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఉదంతం జరిగింది. ఇంట్లో గొడవ పడి వెళ్ళిపోయిన 15 ఏళ్ళ బాలికను ఇంటికి చేరుస్తామని నమ్మించిన ఇద్దరు వ్యక్తులు ఆమెను కటక్ శివార్లలోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో నిర్బంధించారు. 22 రోజుల పాటు ఆమెపై అత్యాచారం చేస్తూ చిత్రహింసలకు గురి చేశారని బాలిక పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చింది.

పౌల్ట్రీ ఫామ్‌లో బాలికపై జరుగుతున్న అఘాయిత్యాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలికను విడిపించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారికి అప్పగించారు. నిందితులు సంతోశ్ బెహరా, రాకేశ్ రవుత్‌లపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. మైనర్ బాలికపై రేప్ విషయం స్థానికంగా కలకలం రేపడంతో భువనేశ్వర్-కటక్ పోలీస్ కమిషనర్ సుధాంశు సారంగి స్వయంగా కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు.

Also read: ఆసియాలో అతిపొడవైన టన్నెల్: తొలి బ్లాస్టింగ్ చేసిన గడ్కరీ

Also read: సోనుసూద్‌కు అరుదైన అవకాశం.. దానికి గుర్తింపుగానే!

Also read: కరోనా వాక్సిన్… క్లినికల్ ట్రయల్స్‌లో కీలక మార్పు

Also read: సముద్రంలో బోటు గల్లంతు