Breaking news: మే 25 నుంచి డొమెస్టిక్ విమాన ప్రయాణం… క్లారిటీ ఇచ్చిన మంత్రి

|

May 20, 2020 | 5:26 PM

రెండు నెలలుగా నిలిచిపోయిన డొమెస్టిక్ విమానాల రాకపోకలు మే నెల 25 తేదీ నుంచి ప్రారంభం అవుతాయని ప్రకటించారు కేంద్ర విమానయాన శాఖా మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ ప్రకటించారు.

Breaking news: మే 25 నుంచి డొమెస్టిక్ విమాన ప్రయాణం... క్లారిటీ ఇచ్చిన మంత్రి
Follow us on

Domestic flights to fly from May 25th onwards: రెండు నెలలుగా నిలిచిపోయిన డొమెస్టిక్ విమానాల రాకపోకలు మే నెల 25 తేదీ నుంచి ప్రారంభం అవుతాయని ప్రకటించారు కేంద్ర విమానయాన శాఖా మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ ప్రకటించారు. ఈ మేరకు అన్ని విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా వివరాలను వెల్లడించారు.

బుధవారం కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ కీలక ప్రకటన చేశారు. తన ప్రకటనను ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. దేశంలో రెండు నెలలుగా నిలిచిపోయిన దేశీయ (డొమెస్టిక్) విమానాలు మే 25వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయని ఆయన తెలిపారు. అయితే, పర్టిక్యులర్ నిబంధనలను, ఆంక్షలను విమానాశ్రాయాల్లోను, విమానాల్లోను తప్పకుండా పాటించాల్సి వుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ విధివిధానాలను విమానయాన శాఖ వెల్లడిస్తుందని ఆయన బుధవారం ట్వీట్ చేశారు.

గత వారమే దేశీయ విమానాలను అనుమతిస్తారని ప్రచారం జరగడంతో దేశంలో పలు ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులు పాటించాల్సిన నిబంధనలతో ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేశారు. విమానాశ్రయాల్లోకి ఎంట్రీతోపాటు టేకాఫ్ వరకు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. వీలైనంత వరకు పేపర్‌లెస్ ప్రయాణాలను ప్రోత్సహించే దిశగా చర్యలు చేపట్టారు. ఎయిర్‌పోర్టుల ఆవరణలో శానిటైజర్లు, ఫేస్ మాస్కులు ఏర్పాటు చేశారు. ప్రయాణికుల స్క్రీనింగ్‌కు ఏర్పాట్లు చేశారు. విమానాల్లోను సీటు వదిలి సీటును ప్రయాణికులకు కేటాయించేలా నెంబరింగ్ చేశారు. తాజాగా హోం శాఖ మరిన్ని విధివిధానాలను కూడా జారీ చేయనుండడంతో వాటిని మే 24 లోపే పరిశీలించి డొమెస్టిక్ విమానాలను సాధారణ ప్రయాణికుల కోసం అనుమతించనున్నారు.

కాగా, విదేశాల నుంచి వందే భారత్ పేరిట తరలిస్తున్న ప్రయాణికుల కోసం ప్రదాన విమానాశ్రాయాల్లో చేసిన ఏర్పాట్లపై ఐసీఎంఆర్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నిబంధనలను సుదీర్ఘ కాలం పాటించాల్సి వుంటుందని, విమానాశ్రాయాల్లో కరోనా పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లను చేయాల్సి వుందని, అది ముందు ముందు అంతర్జాతీయ విమానాల రాకపోకలకు కూడా ఉపయోగపడుతుందని సివిల్ ఆవియేషన్ మంత్రిత్వ శాఖ అధికారులు అంటున్నారు.