మంత్రి జవహర్ కి టికెట్ కేటాయింపుపై టీడీపీలో విభేదాలు

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు టీడీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. మంత్రి జవహర్ కు టికెట్ కేటాయింపుపై టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. జవహర్ కు టికెట్ ఇస్తే పనిచేసేది లేదని కొన్ని రోజుల క్రితం అధిష్టానానికి వ్యతిరేక వర్గం తేల్చి చెప్పింది. మూడు రోజుల క్రితం జవహర్ కు వ్యతిరేకంగా ర్యాలీ కూడా నిర్వహించింది. కాగా.. వ్యతిరేక వర్గం ర్యాలీకి పోటీగా జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి జవహర్ కు మద్దతుగా తమ బలాన్ని ప్రదర్శించారు. మంత్రి […]

మంత్రి జవహర్ కి టికెట్ కేటాయింపుపై టీడీపీలో విభేదాలు

Edited By:

Updated on: Feb 20, 2019 | 7:16 AM

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు టీడీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. మంత్రి జవహర్ కు టికెట్ కేటాయింపుపై టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. జవహర్ కు టికెట్ ఇస్తే పనిచేసేది లేదని కొన్ని రోజుల క్రితం అధిష్టానానికి వ్యతిరేక వర్గం తేల్చి చెప్పింది. మూడు రోజుల క్రితం జవహర్ కు వ్యతిరేకంగా ర్యాలీ కూడా నిర్వహించింది. కాగా.. వ్యతిరేక వర్గం ర్యాలీకి పోటీగా జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి జవహర్ కు మద్దతుగా తమ బలాన్ని ప్రదర్శించారు. మంత్రి జవహర్ కే టికెట్ కేటాయించాలంటూ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్షికి వినతిపత్రం అందజేశారు.

Follow Us