ఆప్ ర్యాలీకి ఢిల్లీ పోలీసుల అనుమతి నిరాకరణ

|

Mar 23, 2019 | 8:52 PM

ఢిల్లీలో ఆప్ ప్రభుత్వానికి, కేంద్రంలోని అధికార బీజేపీకి మధ్య  వైరం రోజురోజుకి ముదిరిపోతుంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర్లో ఉన్న నేపథ్యంలో ఈ వేడి మరింత రాజుకుంటుంది. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్వహించ తలపెట్టిన జనసభ  ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు.  దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఛీప్  బీజేపీపై అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై, మోడీపై విమర్శలు ఎక్కుపెట్టారు. సభ నిర్వహించే స్థలం, ప్రదేశం అత్యంత సున్నితమైనవి కాబట్టి, భద్రతా కారణాల ద‌ృష్ట్యా అనుమతి […]

ఆప్ ర్యాలీకి ఢిల్లీ పోలీసుల అనుమతి నిరాకరణ
Follow us on

ఢిల్లీలో ఆప్ ప్రభుత్వానికి, కేంద్రంలోని అధికార బీజేపీకి మధ్య  వైరం రోజురోజుకి ముదిరిపోతుంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర్లో ఉన్న నేపథ్యంలో ఈ వేడి మరింత రాజుకుంటుంది. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్వహించ తలపెట్టిన జనసభ  ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు.  దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఛీప్  బీజేపీపై అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై, మోడీపై విమర్శలు ఎక్కుపెట్టారు.

సభ నిర్వహించే స్థలం, ప్రదేశం అత్యంత సున్నితమైనవి కాబట్టి, భద్రతా కారణాల ద‌ృష్ట్యా అనుమతి ఇవ్వలేదని సమాచారం. కాగా దీనికి బీజేపీయే కారణమని ఆప్ ఆరోపించింది. ఢిల్లీలో బీజేపీ నిర్వహించిన ఏ ర్యాలీకి ఢిల్లీ పోలీసులు అడ్డు చెప్పలేదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విమర్శించారు. ఢిల్లీలోని ఏడు సీట్లు ఓడిపోతున్నామని బీజేపీవాళ్లూ ఒప్పుకోండని అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.