ఇవాళ జమ్మూ సెక్టార్ లో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ టూర్

|

Jul 09, 2020 | 10:56 AM

భారత్-చైనా సరిహద్దుల ఉద్రిక్తత అనంతరం తొలిసారిగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇవాళ జమ్మూ సెక్టార్ లో పర్యటించనున్నారు. జమ్మూ సెక్టార్‌లో గురువారం రాజ్‌నాథ్‌ సింగ్‌ పర్యటిస్తారని రక్షణశాఖ అధికారులు తెలిపారు.

ఇవాళ జమ్మూ సెక్టార్ లో రక్షణమంత్రి  రాజ్‌నాథ్‌ టూర్
Follow us on

భారత్-చైనా సరిహద్దుల ఉద్రిక్తత అనంతరం తొలిసారిగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇవాళ జమ్మూ సెక్టార్ లో
పర్యటించనున్నారు. జమ్మూ సెక్టార్‌లో గురువారం రాజ్‌నాథ్‌ సింగ్‌ పర్యటిస్తారని రక్షణశాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సరిహద్దు రహదారుల సంస్థ నిర్మించిన పలు అభివృద్ధి కార్యాక్రమాలను మంత్రి ప్రారంభిస్తారన్నారు. ఇందులో భాగంగా కొత్త నిర్మించిన ఆరు బ్రిడ్జిలను ఆయన ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సుమారు రూ.43 కోట్ల వ్యయంతో ఆరు వంతెనలు నిర్మించినట్లు అధికారులు తెలిపారు. అఖ్నూర్ సెక్టార్‌లో నాలుగు వంతెనలు, జమ్మూ-రాజ్ పురా ప్రాంతంలో రెండు వంతెనలను రక్షణ మంత్రి ప్రారంభించనున్నారు. ముఖ్యంగా జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్‌లో బీఆర్ఓ ద్వారా రహదారి పనులకు అదనంగా రూ.1,691 కోట్లు మంజూరు చేస్తూ గత నెలలో కేంద్రం ఆమోదం తెలిపింది. అనంతరం సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులపై ఆర్మీ ఆధికారులతో చర్చించే అవకాశముంది. సరిహద్దు ఉద్రిక్తతల అనంతరం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తొలిసారిగా పర్యటిస్తున్నారు. గతవారం మోదీ ఆకస్మీక పర్యటనతో రాజ్‌నాథ్‌ సింగ్‌ టూర్ వాయిదా పడింది,