బ్రేకింగ్: అరవింద్‌ది దొంగ సర్టిఫికేట్?

|

May 24, 2020 | 11:56 AM

బీజేపీకి చెందిన నిజామాబాద్ లోక్ సభ సభ్యుడు ధర్మపురి అరవింద్ కేంద్ర ఎన్నికల కమిషన్‌ను తప్పుదోవ పట్టించారని, తప్పుడు సమాచారం ఇచ్చారని ఫిర్యాదు చేసింది టీఆర్ఎస్ పార్టీ....

బ్రేకింగ్:  అరవింద్‌ది దొంగ సర్టిఫికేట్?
Follow us on

TRS Leader Krishank alleging that Nizamabad MP D.Aravind produced fake PG certificate: బీజేపీకి చెందిన నిజామాబాద్ లోక్ సభ సభ్యుడు ధర్మపురి అరవింద్ కేంద్ర ఎన్నికల కమిషన్‌ను తప్పుదోవ పట్టించారని, తప్పుడు సమాచారం ఇచ్చారని ఫిర్యాదు చేసింది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ అధికార ప్రతినిధి క్రిశాంత్ ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు. అరవింద్ తప్పుడు సర్టిఫికేట్లతో ఎన్నికల అఫిడవిట్ సమర్పించారన్నది క్రిశాంత్ ప్రధాన అభియోగం.

నిజామాబాద్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన ధర్మపురి అరవింద్ తాను రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి ఎం.ఏ. పొలిటికల్ సైన్సు విభాగంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసినట్లు అఫిడవిట్ సమర్పించారని క్రిశాంక్ ఆరోపిస్తున్నారు. ‘‘ నిజానికి అరవింద్ ఎన్నికల కమిషన్‌ను తప్పుడు దోవ పట్టిచ్చారు.. ఎన్నికల అఫిడవిట్‌లో ఏంఏ పొలిటికల్ సైన్స్ చదివిన అని తప్పుడు సమాచారం ఇచ్చారు.. అరవింద్ దొంగ సర్టిఫికెట్ సృష్టించాడు.. అసలు అరవింద్ రాజస్థాన్ రాష్ట్రంలో ఎలాంటి విద్యను అభ్యసించలేదు… దొంగ సర్టిఫికెట్ రూపకల్పన వివాదంలో ఇరుక్కుని సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న ఒక సంస్థ నుంచి పీజీ సర్టిఫికెట్‌ను అరవింద్ కొన్నారు..’’ అని క్రిశాంక్ వాదిస్తున్నారు.

నిజామాబాద్ ఎంపీపై అనర్హత వేటు వెయ్యాలంటూ త్వరలో హైకోర్టులో కేసు వేస్తున్నామని ఆయన తెలిపారు. ఏడాదిగా అరవింద్ దొంగ సర్టిఫికెట్‌తో ఎంపీగా చలామణి అవుతున్నారని క్రిశాంక్ ఆరోపిస్తున్నారు. క్రిశాంక్ వ్యాఖ్యలతో తెలంగాణలో రాజకీయ కలకలం చెలరేగింది. అయితే, మాజీ ఎంపి కవిత మెప్పు పొందేందుకే క్రిశాంత్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కమలనాథులు మండిపడుతున్నారు.