కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ కి కరోనా..!

|

Jul 15, 2020 | 2:24 PM

కరోనా మహమ్మారి ధాటికి ఫ్రంట్ వారియర్స్ సైతం తల్లడిల్లుతున్నారు. ముందు వరుస నిలబడి పోరాడిన యోధులు కూడా వైరస్ బారినపడుతున్నారు. తాజాగా తమిళనాడులో ఓ జిల్లా కలెక్టర్ కు కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందతున్నాడు.

కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ కి కరోనా..!
Follow us on

కరోనా మహమ్మారి ధాటికి ఫ్రంట్ వారియర్స్ సైతం తల్లడిల్లుతున్నారు. ముందు వరుస నిలబడి పోరాడిన యోధులు కూడా వైరస్ బారినపడుతున్నారు. తాజాగా తమిళనాడులో ఓ జిల్లా కలెక్టర్ కు కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందతున్నాడు.

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా కలెక్టర్‌ కే రాజమణికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా రాకాసి కల్లోలానికి గురైన తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు రాజమణి. ఎప్పటికప్పుడు క్రింది స్థాయి అధికారులను అప్రమత్తం చేస్తూ జిల్లావ్యాప్తంగా పర్యటించారు. కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో తిరగుతూ కరోనా కట్టడి నిరంతం పోరాడారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించారు రాజమణి. అయితే, గత రెండు నుంచి కలెక్టర్‌ జ్వరంతో బాధపడుతుండగా మంగళవారం ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌కు కరోనా సోకినట్లు బుధవారం వైద్యాధికారులు తేల్చారు. కోయంబత్తూరులోని కోవై మెడికల్‌ సెంటర్‌ అండ్‌ హాస్పిటల్‌లో కలెక్టర్‌ కరోనా చికిత్స తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా నియంత్రణ నేపథ్యంలో కలెక్టర్‌ కంటైన్మెంట్‌ జోన్లలో పర్యటించారని జిల్లా వైద్యాధికారి రామదురై మురుగన్‌ తెలిపారు. కలెక్టర్‌లో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉన్నట్లు వెల్లడించారు.