ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ నకిలీ చెక్కుల కేసు సీఐడీకి అప్పగింత

|

Sep 22, 2020 | 6:53 AM

సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) నకిలీ చెక్కుల కేసును జగన్ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. రూ.117 కోట్లను కొల్లగొట్టేందుకు జరిగిన ప్రయత్నంగా పోలీసులు కేసు నమోదు నమోదు చేశారు. సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించారు. నిందితుల కోసం పశ్చిమబెంగాల్, కర్ణాటక, ఢిల్లీలకు ప్రత్యేక బృందాలను పంపించారు. ఢిల్లీలోని శర్మ ఫోర్సింగ్.. పశ్చిమ బెంగాల్ లోని మల్లబపూర్ పీపుల్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ.. కర్ణాటకలోని అద్వైత వీకే , హోలో బ్లాక్స్ & ఇంటర్ […]

ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ నకిలీ చెక్కుల కేసు సీఐడీకి అప్పగింత
Follow us on

సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) నకిలీ చెక్కుల కేసును జగన్ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. రూ.117 కోట్లను కొల్లగొట్టేందుకు జరిగిన ప్రయత్నంగా పోలీసులు కేసు నమోదు నమోదు చేశారు. సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించారు. నిందితుల కోసం పశ్చిమబెంగాల్, కర్ణాటక, ఢిల్లీలకు ప్రత్యేక బృందాలను పంపించారు. ఢిల్లీలోని శర్మ ఫోర్సింగ్.. పశ్చిమ బెంగాల్ లోని మల్లబపూర్ పీపుల్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ.. కర్ణాటకలోని అద్వైత వీకే , హోలో బ్లాక్స్ & ఇంటర్ లాక్ సంస్థల పేరిట ఫోర్జరీ చెక్కులను గుర్తించిన సీఐడీ ఈ అంశాలపై ఆరా ప్రారంభించింది. ఫోర్జరీ వెనుక ఎవరున్నారనే కోణంలో తుళ్లూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు ఏసీబీ అంతర్గత విచారణలో గతంలో ఎప్పుడైనా నకిలీ చెక్కులతో నగదును మార్చారా అనే కోణంలో విచారణ సాగుతోంది.