
ఈ నెల 25న ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇందు కోసం ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లా అధికార యంత్రాంగం. అయితే అధికారికంగా మాత్రం సీఎం పర్యటన వివరాలను వెల్లడిచకపోయినప్పటికీ.. కలెక్టర్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక వేల పర్యటన ఖరారైతే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష ఉంటుందని కలెక్టర్ నారాయణరెడ్డి స్పష్టం చేశారు.
జిల్లాలోని అన్ని మున్సిపాల్ కమిషనర్లు వివిధ పనుల పురోగతికి సంబంధించిన వివరాలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సెల్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాల మేరకు పురపాలక సంఘాల్లో పెండింగ్ పనులతో పాటు ఆ యా మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా చేపట్టిన, చేపట్టబోయే పనుల ప్రణాళికలు సిద్ధం చేయాలని కమిషనర్లకు చెప్పారు. ఇందులో హరితహారం కార్యక్రమానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, మున్సిపాలిటీల్లో ప్రతి ఐదు వార్డులకు ఒకటి చొప్పున నర్సరీలు, ఒక్కో నర్సరీలో లక్ష మొక్కలు పెంచేలా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.