రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం…

|

Dec 11, 2019 | 9:07 PM

దేశంలో సంచలనాత్మకంగా, వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ బిల్లుపై ఇవాళ రాజ్యసభలో చర్చ జరిగింది. ఇక చర్చ అనంతరం క్యాబ్ బిల్లు సవరణలపై ఓటింగ్ జరిపారు. మూజువాణి, డివిజన్ అఫ్ ఓటుతో రాజ్యసభలో ఆమోద ముద్ర పడింది. ఇక ఇప్పటికే లోక్‌సభలో ఈ బిల్లుకు ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. రెండు సభల్లోనూ ఆమోదం లభించడంతో దేశంలో ఇక ఈ బిల్లు అఫీషియల్‌గా ఇంప్లిమెంట్ అయ్యేందుకు మార్గం సుగమం అయింది. మరోవైపు సభలో 43 సవరణల విషయంలో […]

రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం...
Follow us on

దేశంలో సంచలనాత్మకంగా, వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ బిల్లుపై ఇవాళ రాజ్యసభలో చర్చ జరిగింది. ఇక చర్చ అనంతరం క్యాబ్ బిల్లు సవరణలపై ఓటింగ్ జరిపారు. మూజువాణి, డివిజన్ అఫ్ ఓటుతో రాజ్యసభలో ఆమోద ముద్ర పడింది. ఇక ఇప్పటికే లోక్‌సభలో ఈ బిల్లుకు ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. రెండు సభల్లోనూ ఆమోదం లభించడంతో దేశంలో ఇక ఈ బిల్లు అఫీషియల్‌గా ఇంప్లిమెంట్ అయ్యేందుకు మార్గం సుగమం అయింది.

మరోవైపు సభలో 43 సవరణల విషయంలో సెలెక్ట్ కమిటీకి పంపడంపై ఓటింగ్ జరగ్గా.. బిల్లుకు 125 మంది మద్దతు తెలిపగా.. వ్యతిరేకంగా 105 మంది ఓటింగ్ వేశారు. కాగా, రాజ్యసభలో ఓటింగ్‌కి శివసేన దూరంగా ఉంది. దీనితో ఉభయసభల్లో క్యాబ్ బిల్లుకు ఆమోద ముద్ర పడింది. కాగా, రాజ్యసభ రేపటికి వాయిదా పడింది.