కలెక్టర్లకు, ఎస్పీలకు జగన్ ఝలక్.. కారణం అదే !

|

Dec 17, 2019 | 2:09 PM

ఏపీలోని జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద ఝలక్ ఇచ్చారు. నిన్నటి వరకు చెబుతూ వచ్చిన మాటని పక్కన పెట్టారు. ఉన్నట్లుండి జగన్ తీసుకున్న నిర్ణయంతో కలెక్టర్లు, ఎస్పీలు షాక్‌కు గురయ్యారు. ముందు అలా చెప్పి, ఇప్పుడిలా చేయడమేంటని నివ్వెరపోతున్నారు కలెక్టర్లు, ఎస్పీలు. గత 8 రోజులుగా ముఖ్యమంత్రి జగన్ సహా ప్రభుత్వ పెద్దలంతా అసెంబ్లీ శీతాకాల సమావేశాలతో బిజీగా వుండిపోయారు. గత ఆరునెలల పాలనపై సభలోను వాడీవేడీ చర్చ జరిగింది. […]

కలెక్టర్లకు, ఎస్పీలకు జగన్ ఝలక్.. కారణం అదే !
Follow us on

ఏపీలోని జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద ఝలక్ ఇచ్చారు. నిన్నటి వరకు చెబుతూ వచ్చిన మాటని పక్కన పెట్టారు. ఉన్నట్లుండి జగన్ తీసుకున్న నిర్ణయంతో కలెక్టర్లు, ఎస్పీలు షాక్‌కు గురయ్యారు. ముందు అలా చెప్పి, ఇప్పుడిలా చేయడమేంటని నివ్వెరపోతున్నారు కలెక్టర్లు, ఎస్పీలు.

గత 8 రోజులుగా ముఖ్యమంత్రి జగన్ సహా ప్రభుత్వ పెద్దలంతా అసెంబ్లీ శీతాకాల సమావేశాలతో బిజీగా వుండిపోయారు. గత ఆరునెలల పాలనపై సభలోను వాడీవేడీ చర్చ జరిగింది. ప్రభుత్వ పథకాలపై అధికార పక్షం వీలైనంతగా చెప్పుకుంది. ఇదంతా బాగానే వున్నా.. వింటర్ సెషన్ ముగిసిన తర్వాత పరిస్థితి ఏంటి ? కార్యాచరణ ఏంటి ? దానిలో అధికారుల పాత్ర ఏంటి ? ఈ అంశాలపై దృష్టి సారించారు ముఖ్యమంత్రి జగన్.

అందుకోసం రాష్ట్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను విజయవాడలో విందుకు ఆహ్వానించారు ముఖ్యమంత్రి జగన్. మంగళవారం సభా కార్యక్రమాలు ముగిసిన తర్వాత విందు అరేంజ్ చేశారు. అయితే, ఈలోగా ముఖ్యమంత్రి సడన్‌గా ఓ నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్లకు, ఎస్పీలకు షాకిచ్చారు.

మంగళవారం సాయంత్రం జరగనున్న గెట్ టు గెదర్ సమావేశానికి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను రావద్దని సీఎంఓ ద్వారా సందేశం పంపారు. ఎంపీలు కూడా హాజరుకానవసరం లేదని సమాచారం ఇచ్చారు. కేవలం మంత్రులు, ఎమ్మెల్యేలు, విజయవాడలో ఉండే సివిల్ సర్వీస్ అధికారులకు మాత్రమే సీఎం విందు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

అయితే ఇందుకు ప్రధాన కారణం వేరే వుందని సమాచారం. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతోపాటు ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కావాలని ముఖ్యమంత్రి అనుకుంటున్నారట. ఆ సందర్భంగా వారికి ప్రత్యేకంగా సమయం ఇచ్చేలా మరో విందు ఏర్పాటు చేయాలని సీఎం భావిస్తున్నారట. అందుకే సోమవారం సాయంత్రమే కలెక్టర్లకు, ఎస్పీలకు సమాచారం అందించారని తెలుస్తోంది. దాంతో మంగళవారం నాటి విందు కోసం కేవలం రాష్ట్ర స్థాయి అధికారులు మాత్రమే రావాలని సీఎంఓ నుంచి క్లియర్ కట్‌గా మెసేజ్ పంపినట్లు తెలుస్తోంది.