దుబాయ్ బయలుదేరిన ధోనీ టీమ్…

చెన్నై ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో ఆటగాళ్లు, కోచింగ్‌ సిబ్బంది తదితరులు యూఏఈకి పయనమయ్యారు. టీమ్‌ సీనియర్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ మాత్రం జట్టుతో పాటు వెళ్లట్లేదు. సెప్టెంబర్‌ 19 నుంచి యూఏఈలోని...

దుబాయ్ బయలుదేరిన ధోనీ టీమ్...

Updated on: Aug 21, 2020 | 4:36 PM

ఐపీఎల్ వేడుకకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఐపీఎల్‌ -13వ సీజన్‌ కోసం మూడు జట్ల ఆటగాళ్లు, సహాయ సిబ్బంది యూఏఈకి పయనమవుతున్నారు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాళ్లు గురువారం చేరుకున్నారు. తాజాగా మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) జట్టు శుక్రవారం యూఏఈకి బయలుదేరింది. ఇందుకు సంబందించిన సమాచారాన్ని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తమ ట్విట్టర్ వేదికగా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఎల్లో ఆన్ ది మూవ్.. విష్ టెల్ పొడు.. అంటూ తమిళంలో అభినందనలు తెలిపింది.


చెన్నై ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో ఆటగాళ్లు, కోచింగ్‌ సిబ్బంది తదితరులు యూఏఈకి పయనమయ్యారు. టీమ్‌ సీనియర్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ మాత్రం జట్టుతో పాటు వెళ్లట్లేదు. సెప్టెంబర్‌ 19 నుంచి యూఏఈలోని దుబాయ్‌, అబుదాబి, షార్జా వేదికల్లో ఐపీఎల్‌ జరుగనుంది. అంతాకూడా కోవిడ్ -19 నిబంధనలకు అనుగుణంగా రెండు వారాల ముందే  దుబాయ్ చేరుకుంటున్నాయి ఐపీఎల్ జట్లు.