రైల్వే టికెట్ తనిఖీ కోసం సరికొత్త యాప్

|

Jul 24, 2020 | 4:58 PM

కరోనా మహమ్మారి ప్రభావంతో అన్ని రంగాలు కొత్త మార్గాలపై దృష్టి సారించాయి. వ్యక్తుల మధ్య దూరాన్ని మరింతగా పెంచుతోంది. ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణికుల టికెట్ల తనిఖీకి సెంట్రల్ రైల్వే ముంబై డివిజన్ సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రయాణికులను తాకకుండానే టికెట్ల తనిఖీ చేసేందుకు ‘చెక్ఇన్ మాస్టర్’ పేరుతో ఓ యాప్ ను రూపొందించారు.

రైల్వే టికెట్ తనిఖీ కోసం సరికొత్త యాప్
Follow us on

కరోనా మహమ్మారి ప్రభావంతో అన్ని రంగాలు కొత్త మార్గాలపై దృష్టి సారించాయి. వ్యక్తుల మధ్య దూరాన్ని మరింతగా పెంచుతోంది. ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణికుల టికెట్ల తనిఖీకి సెంట్రల్ రైల్వే ముంబై డివిజన్ సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రయాణికులను తాకకుండానే టికెట్ల తనిఖీ చేసేందుకు ‘చెక్ఇన్ మాస్టర్’ పేరుతో ఓ యాప్ ను రూపొందించారు. దీని ద్వారా రైల్వే టీసీలు ప్రయాణికుల వద్ద ఉన్న టికెట్లను ముట్టుకోకుండా తమ మొబైల్స్‌లోని ఈ యాప్ ద్వారా వాటిని తనిఖీ చేస్తున్నారు. రైల్వే టికెట్లపై ఉండే బార్ కోడ్, క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తనిఖీ చేస్తున్నారు. తొలుత ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ స్టేషన్‌లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. టికెట్లు తనిఖీ చేసే రైల్వే సిబ్బందికి కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు ఈ యాప్‌ను ప్రవేశపెట్టినట్లు సెంట్రల్ రైల్వే ముంబై డివిజన్ అధికారులు తెలిపారు.