
రాజస్థాన్: భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఓ పెళ్లి ఆగిపోయింది. రాజస్థాన్‌లోని బర్మర్ జిల్లాకు చెందిన మహేంద్ర సింగ్‌కు పాక్ లోని సింధ్ ప్రావిన్సుకు చెందిన చగన్ కర్వార్ అనే యువతికి ఈ నెల 8న పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయించారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వీసాలు కూడా తీసుకున్నారు.
అయితే అంతలోనే పరిస్థితి మారిపోయింది. పుల్వామా ఉగ్రదాడి మొదలుకొని అభినందన్ భారత్‌కు తిరిగి క్షేమంగా వచ్చేంత వరకూ ఆ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆ పెళ్లి ఆగిపోయింది. ఇరు కుటుంబ సభ్యులు పెళ్లిని వాయిదా వేసుకున్నారు. ఇరు దేశాల మధ్య పరిస్థితి చక్కబడ్డాకనే తాము వివాహం చేసుకుంటామని పెళ్లి కుమారుడు మహేంద్ర సింగ్ చెబుతున్నాడు.