ఇండియాలోనే ఐఫోన్-11 త‌యారీ.. భార‌త్‌కు త‌గ్గిన ట్యాక్స్ భారం

మార్కెట్లో ఎన్ని ర‌కాల బ్రాండ్ ఫోన్లు ఉన్న‌ప్ప‌టికీ.. యాపిల్ బ్రాండ్‌కి ఉండే క్రేజే వేరు. ఎప్ప‌టిక‌ప్పుడు మార్కెట్లో త‌న ప్ర‌త్యేక‌త‌ను కాపాడుకోవ‌డంలో యాపిల్ కంపెనీ స‌క్సెస్ అవుతూ వ‌స్తుంది. అందుకే యాపిల్ ఉత్ప‌త్తుల‌కు ముఖ్యంగా ఆ సంస్థ తయారీ చేసే ఫోన్ల‌కు...

ఇండియాలోనే ఐఫోన్-11 త‌యారీ.. భార‌త్‌కు త‌గ్గిన ట్యాక్స్ భారం

Edited By:

Updated on: Jul 26, 2020 | 11:49 AM

మార్కెట్లో ఎన్ని ర‌కాల బ్రాండ్ ఫోన్లు ఉన్న‌ప్ప‌టికీ.. యాపిల్ బ్రాండ్‌కి ఉండే క్రేజే వేరు. ఎప్ప‌టిక‌ప్పుడు మార్కెట్లో త‌న ప్ర‌త్యేక‌త‌ను కాపాడుకోవ‌డంలో యాపిల్ కంపెనీ స‌క్సెస్ అవుతూ వ‌స్తుంది. అందుకే యాపిల్ ఉత్ప‌త్తుల‌కు ముఖ్యంగా ఆ సంస్థ తయారీ చేసే ఫోన్ల‌కు అంత గిరాకీ ఉంటుంది. ఇక తాజాగా యాపిల్ సంస్థ ఓ స‌రికొత్త నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌పై భార‌త్‌లో యాపిల్ ఉత్ప‌త్తుల‌ను తాయ‌రు చేయ‌బోతున్న‌ది. చెన్నైలోని ఫ్యాక్స్ కాన్ ప్లాంట్‌లో యాపిట్ ఐ ఫోన్-11ని ఉత్త‌త్తి చేయ‌బోతుంది. ఇందుకు సంబంధించిన మోడ‌ల్‌ను కూడా బెంగుళూరులోనే త‌యారు చేస్తున్నారు.

కాగా గ‌తంలో 2019లో బెంగుళ్లూరు ప్లాంట్‌లోనే ఎక్స్ ఆర్ మోడ‌ల్ అసెంబ్లింగ్ జ‌రిగింది. మ‌ళ్లీ ఇప్పుడు ఐ ఫోన్-11 మోడ‌ల్ కూడా బెంగుళూరు ప్లాంట్‌లోనే త‌యారు చేయ‌డం విశేషం. ఐఫోన్‌ను ఉత్ప‌త్తి చేసే ఫాక్స్ కాన్‌, పెగ‌ట్రాన్ కంపెనీలు ఇండియాలో భారీ స్థాయిలో పెట్టుబ‌డులు పెట్ట‌బోతున్నాయి. ఇక ఐఫోన్ 11 మేడ్ ఇన్ ఇండియాగా ఉత్ప‌త్తి కాబోతుంది. కాగా ఇప్ప‌టికే శాంసంగ్, షావోమి కంపెనీలు ఇండియాలోనే కంపెనీలు ఏర్పాటు చేసి మేడ్ ఇన్ ఇండియా ప్రాడెక్ట్స్‌ని ఉత్ప‌త్తి చేస్తున్నాయి. ఇప్పుడు ఇండియాలో యాపిల్ ఐఫోన్-11 త‌యారు కావ‌డం వ‌ల్ల.. భార‌త్‌కు 20 శాతం వ‌ర‌కూ దిగుమ‌తి ట్యాక్స్ భారం త‌గ్గిన‌ట్టైంది.

Read More:

ఏపీ, తెలంగాణ‌లో కోవిడ్ టెర్ర‌ర్‌.. రోజు ‌రోజుకీ పెరిగిపోతున్న క‌రోనా వ్యాప్తి..

విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. పాలిసెట్ ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు..

క‌రోనా ఎఫెక్ట్: ఆంధ్ర ప్ర‌దేశ్‌లోని ఆ జిల్లాలో 24 గంట‌ల కర్ఫ్యూ