ఏపీ, తెలంగాణ‌లో కోవిడ్ టెర్ర‌ర్‌.. రోజు ‌రోజుకీ పెరిగిపోతున్న క‌రోనా వ్యాప్తి..

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా మ‌హ‌మ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య ఉధృతంగా పెరిగిపోతూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే రెండు రాష్ట్రాల్లోనూ ప‌లు కంటైన్మెంట్ జోన్ల‌లో జులై 31 వ‌ర‌కూ లాక్ డౌన్ పొడిగించాయి ప్ర‌భుత్వాలు. ముందుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌య‌నికొస్తే రాష్ట్ర వ్యాప్తంగా..

ఏపీ, తెలంగాణ‌లో కోవిడ్ టెర్ర‌ర్‌.. రోజు ‌రోజుకీ పెరిగిపోతున్న క‌రోనా వ్యాప్తి..
Follow us

| Edited By:

Updated on: Jul 26, 2020 | 8:45 AM

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా మ‌హ‌మ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య ఉధృతంగా పెరిగిపోతూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే రెండు రాష్ట్రాల్లోనూ ప‌లు కంటైన్మెంట్ జోన్ల‌లో జులై 31 వ‌ర‌కూ లాక్ డౌన్ పొడిగించాయి ప్ర‌భుత్వాలు. ముందుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌య‌నికొస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. శ‌నివారం కొత్త‌గా 53,681 శాంపిల్స్ టెస్టు చేయగా.. అందులో 7,813 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 88,671కి చేరింది. వీటిల్లో 44,431 యాక్టివ్ కేసులు ఉండగా.. 43,255 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 985కి చేరుకుంది.

అటు గడిచిన 24 గంటల్లో 3,208 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. 52 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. నిన్న ఒక్క రోజే తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1324 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత పశ్చిమగోదావరిలో 1012, విశాఖపట్నంలో 936 కేసులు నమోదయ్యాయి. ఇక అనంతపురం 723, చిత్తూర్ 300, గుంటూరు 656, కడప 294, కృష్ణ 407, కర్నూలు 742, నెల్లూరు 299, ప్రకాశం 248, శ్రీకాకుళం 349, విజయనగరం 523 కేసులు నమోదయ్యాయి. కాగా, తూర్పుగోదావరిలో అత్యధికంగా 12,391 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. కర్నూలులో 156 కరోనా మరణాలు సంభవించాయి.

తెలంగాణలో కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. నిత్యం పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కాగా శ‌నివారం తెలంగాణ‌లో క‌రోనా బులిటెన్ రిలీజ్ చేయ‌లేదు. రోజు చేస్తున్న ఫార్మాట్‌కి మార్పులు చేస్తున్నందు వ‌ల్ల నేడు బులిటెన్ రిలీజ్ చేయ‌డం లేద‌ని మీడియాకి స‌మాచారం అందించింది టీఎస్ స‌ర్కార్‌. ఇక నిన్న తెలంగాణలో కొత్త‌గా 1,640 పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 52,466కి చేరుకుంది. రాష్ట్రంలో కరోనా బారిన పడి ఇప్ప‌టివ‌ర‌కూ 455 మంది ప్రాణాలొదిలారు.

Read More:

విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. పాలిసెట్ ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు..

క‌రోనా ఎఫెక్ట్: ఆంధ్ర ప్ర‌దేశ్‌లోని ఆ జిల్లాలో 24 గంట‌ల కర్ఫ్యూ