క‌రోనా ఎఫెక్ట్: ఆంధ్ర ప్ర‌దేశ్‌లోని ఆ జిల్లాలో 24 గంట‌ల కర్ఫ్యూ

అందులోనూ ఏపీలోని తూర్పు గోదావ‌రి జిల్లాలో కోవిడ్ కేసులు విప‌రీతంగా న‌మోద‌వుతున్నాయి. దీంతో ఈస్ట్ గోదావ‌రి జిల్లా అధికారులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఆదివారం రోజున వివిధ ర‌కాల మార్కెట్‌ల‌కు తాకిడి ఎక్కువ‌గా ఉంటూండ‌టంతో.. స‌న్ డే ఉద‌యం 6 గంట‌ల నుంచి సోమ‌వారం ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కూ..

క‌రోనా ఎఫెక్ట్: ఆంధ్ర ప్ర‌దేశ్‌లోని ఆ జిల్లాలో 24 గంట‌ల కర్ఫ్యూ
Follow us

| Edited By:

Updated on: Jul 26, 2020 | 8:23 AM

ఏపీలో గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో కోవిడ్ పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకీ కొత్త కేసుల సంఖ్య కూడా పెరిగిపోతూనే ఉంది. అటు ఏపీ ప్ర‌భుత్వం కూడా క‌రోనా క‌ట్ట‌డికి ఎన్నో ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది. ఇక ప‌లు జిల్లాలోని ప్ర‌జ‌లు స్వ‌యంగా లాక్ డౌన్ కూడా విధించుకుంటున్నారు. ఇక ఇప్ప‌టికే ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్ర‌జా ప్ర‌తినిధులు కోవిడ్ బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. ఇక మ‌రోవైపు రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 80 వేలు దాటింది. అందులోనూ ఏపీలోని తూర్పు గోదావ‌రి జిల్లాలో కోవిడ్ కేసులు విప‌రీతంగా న‌మోద‌వుతున్నాయి.

దీంతో ఈస్ట్ గోదావ‌రి జిల్లా అధికారులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఆదివారం రోజున వివిధ ర‌కాల మార్కెట్‌ల‌కు తాకిడి ఎక్కువ‌గా ఉంటూండ‌టంతో.. స‌న్ డే ఉద‌యం 6 గంట‌ల నుంచి సోమ‌వారం ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కూ పూర్తిస్థాయి కర్ఫ్యూ విధించారు. కాగా గ‌త ఆదివారం కూడా ఇలానే క‌ర్ఫ్యూ విధించిన విష‌యం తెలిసిందే. ఈ క‌ర్ఫ్యూతో జిల్లా మొత్తం నిర్మానుష్యంగా మారిపోయింది. ఇప్ప‌టికే తూర్పు గోదావ‌రి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ప్ర‌జ‌లే స్వ‌యంగా లాక్‌డౌన్ విధించుకుంటున్నారు.

ఇక ఆంధ్ర ప్ర‌దేశ్‌లో అత్య‌ధిక క‌రోనా కేసుల‌తో తూర్పు గోదావరి జిల్లా టాప్‌లో ఉంది. ఈస్ట్ గోదావ‌రిలో క‌రోనా కేసుల సంఖ్య ఏకంగా 12 వేలు దాటింది. ప్ర‌స్తుతం అక్క‌డ 12,391 క‌రోనా కేసులు ఉండ‌గా, ఇప్ప‌టివ‌ర‌కూ 113 మంది కోవిడ్ బారిన ప‌డి మ‌ర‌ణించారు. ఇక తూర్పు గోదావ‌రిలో 8595 యాక్టీవ్ కేసులు ఉండ‌గా, 3683 మంది క‌రోనా నుంచి కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Read More: విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. పాలిసెట్ ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు..

'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్ లో వర్క్ ఫ్రం హోం చేసిన టెకీ!
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్ లో వర్క్ ఫ్రం హోం చేసిన టెకీ!
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు