ప్రతి దరఖాస్తు పరిశీలించిన తర్వాతే తొలగింపు-ద్వివేది

ఎన్నికల సంఘం పనితీరుపై సందేహాలు వద్దని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది అన్నారు. ప్రతి దరఖాస్తు పరిశీలించిన తర్వాతే తొలగింపు ఉంటుందని తెలిపారు. ఓట్ల తొలగింపు కోసం మోసం చేస్తుంటే ఈసీ చూస్తూ ఊరుకోదని అన్నారు. రాజకీయ విమర్శలతో తమకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈసీ సిబ్బంది తప్పు చేస్తే సస్పెండ్ అవుతారని స్పష్టం చేశారు ద్వివేది. ఏకపక్షంగా ఓట్లు తొలగించామని విమర్శించేవారు దాన్ని నిరూపించాలని సవాల్ విసిరారు. డేటా చోరి వ్యవహారంలో ఓటర్ల […]

ప్రతి దరఖాస్తు పరిశీలించిన తర్వాతే తొలగింపు-ద్వివేది

Updated on: Mar 06, 2019 | 1:53 PM

ఎన్నికల సంఘం పనితీరుపై సందేహాలు వద్దని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది అన్నారు. ప్రతి దరఖాస్తు పరిశీలించిన తర్వాతే తొలగింపు ఉంటుందని తెలిపారు. ఓట్ల తొలగింపు కోసం మోసం చేస్తుంటే ఈసీ చూస్తూ ఊరుకోదని అన్నారు. రాజకీయ విమర్శలతో తమకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈసీ సిబ్బంది తప్పు చేస్తే సస్పెండ్ అవుతారని స్పష్టం చేశారు ద్వివేది. ఏకపక్షంగా ఓట్లు తొలగించామని విమర్శించేవారు దాన్ని నిరూపించాలని సవాల్ విసిరారు. డేటా చోరి వ్యవహారంలో ఓటర్ల జాబితా ఎక్కడ నుంచి వచ్చిందో సైబరాబాద్ సీపీ సజ్జనార్ చెప్పాలని అన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us