డ్యాన్స్‌లో రిహార్సల్స్ చేయని ఏకైక హీరో ఆయనే: నయనతార

28  August 2026

Basha Shek

దక్షిణాది చిత్రపరిశ్రమలో 'లేడీ సూపర్ స్టార్'గా వెలిగిపోతున్న నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో బిజీ బిజీగా ఉంటోందీ అందాల తార.

ఈ ఏడాది ఇప్పటికే నయనతార నటించిన రెండు సినిమాలు రిలీజయ్యాయి. అందులో ఒకటి మన శంకరవరప్రసాద్ గారు కాగా ఇంకొకటి పేట్రియాట్.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో సుమారు అరడజనకు పైగా సినిమాలున్నాయి. కాగా తెలుగులో పలువురు స్టార్ హీరోలతో కలిసి నటించింది నయన్.

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి సీనియర్ హీరోలతో పాటు ప్రభాస్, ఎన్టీఆర్ వంటి యంగ్ హీరోలతోనూ యాక్ట్ చేసింది నయనతార.

ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ లేడీ సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ అండ్ డ్యాన్సింగ్ స్కిల్స్ పై ప్రశంసలు కురిపించింది.

'చాలా మంది హీరోలు డ్యాన్స్ కోసం గంటల తరబడి రిహార్సల్స్ చేస్తారు. కానీ రిహార్సల్స్ చేయని ఏకైక హీరో ఎన్టీఆర్' అంటూ నయన్ తారక్ ను కొనియాడింది.

'కొరియోగ్రాఫర్ స్టెప్ చూపిస్తే చాలు, ఒక్కసారి చూసి నేరుగా టేక్‌కు వెళ్ళిపోతారు. ప్రొఫెషనల్ డ్యాన్సర్ల కంటే అద్భుతంగా ఆ మూమెంట్స్ చేస్తారు' అంటూ ఎన్టీఆర్ గురించి చెప్పుకొచ్చింది నయన్.

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం' మొదటి భాగం త్వరలోనే రిలీజ్ కానుంది.

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.