మారిన జగన్ రాజకీయ వ్యూహం..! కారణం బీజేపీనా..?

| Edited By:

Oct 08, 2019 | 5:33 PM

రాజకీయాలు.. ఎవరినైనా మార్చేస్తాయి. అలాగే.. రాజకీయాల్లో నేతల వ్యూహాలు కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. తాజాగా.. ఏపీలో సీఎం జగన్ వ్యూహం మార్చారు. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక మెజార్టీతో.. వైసీపీ అధికారాన్ని సొంతం చేసుకుంది. దీంతో.. ఆ పార్టీలోకి వలసలు ఎక్కువయ్యాయి. నేతల వలసలు ఎక్కువైనా.. సమస్యలు వచ్చే ప్రమాదముందని భావించిన జగన్… కొంతకాలం పాటు ఎవరినీ పెద్దగా ప్రోత్సహించలేదు. దీంతో.. చాలా మంది నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే.. తాజాగా వైఎస్సార్సీపీ అధినేత తన వ్యూహాన్ని […]

మారిన జగన్ రాజకీయ వ్యూహం..! కారణం బీజేపీనా..?
Follow us on

రాజకీయాలు.. ఎవరినైనా మార్చేస్తాయి. అలాగే.. రాజకీయాల్లో నేతల వ్యూహాలు కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. తాజాగా.. ఏపీలో సీఎం జగన్ వ్యూహం మార్చారు. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక మెజార్టీతో.. వైసీపీ అధికారాన్ని సొంతం చేసుకుంది. దీంతో.. ఆ పార్టీలోకి వలసలు ఎక్కువయ్యాయి. నేతల వలసలు ఎక్కువైనా.. సమస్యలు వచ్చే ప్రమాదముందని భావించిన జగన్… కొంతకాలం పాటు ఎవరినీ పెద్దగా ప్రోత్సహించలేదు. దీంతో.. చాలా మంది నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే.. తాజాగా వైఎస్సార్సీపీ అధినేత తన వ్యూహాన్ని మార్చినట్టు తెలుస్తోంది.

దేశంలో.. పెద్ద పార్టీ బీజేపీ.. తన బలాన్ని.. రాష్ట్రాల వారీగా విస్తరించాలన్న కోరికతో.. ఈ పార్టీ ఎక్కువగా వలసలను ప్రోత్సహించింది. అలాగే.. ఆసక్తి ఉన్నవారికి భారీగా తాయిలాలు ముట్ట జెప్పి మరీ పలువురు పార్టీల నేతలను పార్టీలో చేర్పించుకుంటున్నారు. తాజాగా.. ఏపీలో.. టీడీపీ నుంచి జనసేన పార్టీ నుంచి పలువురు నేతలు జంప్ అయ్యారు. అంతేకాకుండా.. ‘ఆపరేషన్ ఆకర్ష్’ పేరుతో ఇన్‌డైరెక్ట్‌గా నేతలను ఎట్రాక్ట్ చేశారు. దీంతో.. వైసీపీ సరికొత్త వ్యూహానికి తెరదించింది. బీజేపీలోకి వచ్చే వలసలను అరికట్టాలని భావించిన వైసీపీ.. తమ పార్టీ విమర్శకులు తగ్గుతారని భావించింది. అందుకే తమ పార్టీలోకి వలసలను ప్రోత్సహించడానికి అనువుగా సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే.. దీనికి ఓ షరతు పెట్టారు జగన్. ఎమ్మెల్యేలు పార్టీలో చేరాలనుకుంటే.. పదవికి రాజీనామా చేసి రావాలన్నారు.

కాగా.. ఈ రోజు తాజాగా.. టీడీపీ, జనసేన పార్టీల నేతలు వైసీపీలో చేరారు. దీంతో.. టీడీపీ, జనసేన అధ్యక్షులకు మరో షాక్ తగిలింది. అసలే.. ఈ పార్టీల్లో నేతల సంఖ్య క్రమంగా బలహీనపడుతోంది. అందులోనూ.. జనసేన నేత ఆకుల సత్యనారాయణ, టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు.. జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. జగన్ వీరిద్దరినీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. దీంతో.. రాజీనామాల మాటను పక్కనబెట్టి.. ఇతర పార్టీ నేతల ఆహ్వానానికి జగన్ తమ పార్టీ తలుపులు తెరిచారు.