ఏపీ నిరుద్యోగులకు జగన్ మరో గిఫ్ట్.. ఈసారి మరింత ‘ప్రత్యేకం’

|

Nov 12, 2019 | 5:18 PM

పదవీ బాధ్యతలు చేపట్టినప్పట్నించి ఆంధ్రప్రదేశ్‌లో వున్న నిరుద్యోగులకు వరాల మీద వరాలు గుప్పిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తాజాగా ఓ ‘స్పెషల్’ గిఫ్ట్ ప్రకటించారు. ఉద్యోగాల భర్తీనో.. కొత్త ఉద్యోగాల కల్పనో అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.. ఇది అంతకు మించిన గిప్ట్. రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ సిబ్బంది స్థితిగతులపై మంగళవారం సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్.. అతి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ కార్పొరేషన్‌ ఫర్‌ అవుట్‌సోర్స్‌డ్ ఎంప్లాయిస్‌ (ఆప్‌కాస్‌) వెబ్‌సైట్‌ను […]

ఏపీ నిరుద్యోగులకు జగన్ మరో గిఫ్ట్.. ఈసారి మరింత ‘ప్రత్యేకం’
Follow us on

పదవీ బాధ్యతలు చేపట్టినప్పట్నించి ఆంధ్రప్రదేశ్‌లో వున్న నిరుద్యోగులకు వరాల మీద వరాలు గుప్పిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తాజాగా ఓ ‘స్పెషల్’ గిఫ్ట్ ప్రకటించారు. ఉద్యోగాల భర్తీనో.. కొత్త ఉద్యోగాల కల్పనో అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.. ఇది అంతకు మించిన గిప్ట్.

రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ సిబ్బంది స్థితిగతులపై మంగళవారం సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్.. అతి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ కార్పొరేషన్‌ ఫర్‌ అవుట్‌సోర్స్‌డ్ ఎంప్లాయిస్‌ (ఆప్‌కాస్‌) వెబ్‌సైట్‌ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు కీలక ప్రకటనలు చేశారు ఆయన. వివరాలు…

• జిల్లాల్లోని అన్ని అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు, రాష్ట్రస్థాయిలోని సెక్రటేరియట్‌లో కూడా అవుట్‌ సోర్సింగ్‌ఉద్యోగాలు ఈ కార్పొరేషన్‌ పరిధిలోకి..

• మధ్యవర్తులను (బ్రోకర్లను) పూర్తిగా తొలగించాలన్నదే ఉద్దేశం

• జీతం ఇచ్చేటప్పుడు… ఉద్యోగులను మోసం చేయకుండా ఉండేందుకే..

• వాటా ఇస్తేనే జీతం ఇస్తామన్న మోసపూరిత పనులకు చెక్‌

• లంచాలు తీసుకుని అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉండొద్దు

• మోసాలకు తావులేకుండా, లంచాలు లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలన్నదే లక్ష్యం

• ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 50శాతం మంది ప్రతి కాంట్రాక్ట్‌ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల్లో ఉండాలి

• జిల్లాస్థాయిలో యాభైశాతం ఉద్యోగాలు మహిళలకే

• పీఎఫ్, ఈసీఎస్‌ఐ లాంటి వాటిని ఎగ్గొట్టకుండా ఉండేందుకు చర్యలు

• సకాలానికే జీతాలు వచ్చేలాచూడ్డానికే కార్పొరేషన్

• నెలవారీ జీతం రూ.30 వేల లోపు ఉన్న ఉద్యోగాలు త్వరలో భర్తీ

• అవుట్‌ సోర్స్‌ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన తర్వాతనే అధికారులు జీతాలు తీసుకునే స్థాయిలోకి రావాలి

• డిసెంబర్‌ 15 కల్లా ఉద్యోగాల జాబితాలు కమిటీ నుంచి, శాఖాధిపతుల నుంచి రావాలని ఆదేశం

• జనవరి 1 నుంచి ప్లేస్‌మెంట్‌ ఆర్డర్స్

• ప్రతి అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగానికి ఒక కోడ్‌ నంబర్‌

• ప్రతి కాంట్రాక్టును ఒక ఎంటిటీగా తీసుకోవాలని ఆదేశం

• 50శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ప్రతి కాంట్రాక్టులో ఉన్నారో లేదో చూడాలని ఆదేశం

• జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకున్నా పర్వాలేదన్న సీఎం

• మొత్తంగా చూస్తే… 50శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉండాల్సిందే

• ఇందులో యాభైశాతం ఉద్యోగాలు కూడా 50శాతం మహిళలు ఉండాలి

• జిల్లా స్థాయిలో ఇన్‌ఛార్జి మంత్రి అప్రూవల్‌ అథారిటీగా ఉంటారు

• జిల్లా కమిటీకి జిల్లా కలెక్టర్‌ నేతృత్వం వహిస్తారు

• సెక్రటేరియట్‌ వచ్చేసరికి సంబంధిత శాఖ మంత్రి అప్రూవల్‌ అథారిటీగా ఉంటారు, సంబంధిత శాఖ కార్యదర్శి కమిటీకి కన్వీనర్‌గా ఉంటారు

• డిసెంబర్‌ 15లోగా ప్రక్రియను పూర్తిచేసి, జనవరి 1 నుంచి ప్లేస్‌మెంట్స్‌ ఇవ్వాలి

• మోసాలకు, అవినీతికి తావులేకుండా ఉండేందుకే ఈ కార్పొరేషన్