శ్మశాన వాటికలో ఉద్రిక్త పరిస్థితులు.. కడసారి చూపుకు నోచుకోని అమృత

తండ్రిని కడసారి చూపు కోసం స్మశాన వాటికకు చేరుకుంది అమృత. మిర్యాలగూడలోని హిందూ శ్మశానవాటికలో మారుతీ రావు అంత్యక్రియలు జరిగాయి. పోలీసు భద్రత మధ్య తండ్రి అంత్రక్రియలకు వెళ్లింది అమృత. అయితే.. శ్మశాన వాటికలోని బంధువులు అమృతను...

శ్మశాన వాటికలో ఉద్రిక్త పరిస్థితులు.. కడసారి చూపుకు నోచుకోని అమృత

Edited By:

Updated on: Mar 09, 2020 | 2:07 PM

రియల్టర్ మారుతీరావు ఆత్మహత్య అంశం.. నల్గొండ జిల్లా.. మిర్యాలగూడలో కలకలం రేపుతోంది. మిర్యాలగూడలోని హిందూ శ్మశాన వాటికలో మారుతీరావు అంత్యక్రియలు ముగిశాయి. ఈ క్రమంలో తండ్రిని కడసారి చూపు కోసం శ్మశన వాటికకు చేరుకుంది అమృత. పోలీసు భద్రత మధ్య తండ్రి అంత్రక్రియలకు వెళ్లింది అమృత. అయితే.. శ్మశాన వాటికలోని బంధువులు అమృతను అడ్డుకున్నారు. ‘మారుతీ రావు అమర్‌‌ రహే’, ‘అమృత గో బ్యాక్’ అంటూ.. నినాదాలు చేశారు. దీంతో కడసారి చూపు చూడకుండా వెనుదిరిగింది అమృత. కనీసం తల్లిని పలకరించేందుకు కూడా ఆమె రాలేదని కేకలు వేశారు. దీంతో క్షణాల వ్యవధిలోనే ఆమె అక్కడి నుంచి వెనుదిరిగాల్సి వచ్చింది.

కాగా.. నిన్న హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఓ సూసైడ్ లెటర్ రాసి.. విషం తాగి ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే కూతురు అమృత ప్రేమ వివాహం చేసుకుందనే ఆగ్రహంతో.. 2018లో కిరాయి హంతకులతో కూతురు భర్త ప్రణయ్‌ను దారుణంగా హత్య చేయించారు మారుతీరావు. అమృత-ప్రణయ్‌ ప్రేమ పెళ్లి.. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ప్రణయ్‌ హత్య.. మారుతీరావు ఆత్మహత్య.. రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది.

ఇది కూడా చదవండి: అసలు టార్గెట్ దొరబాబు కాదట.. మరి ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే!

Read More this also: ఆయన్ని కొడితే రోజాకు మంత్రి పదవి గ్యారెంటీ.. ఆనందంలో రోజా!

Read More: మళ్లీ ప్రేమలో పడ్డ టాలీవుడ్ విలన్! ఈయనది 51.. ఆమెది 33

ఇది కూడా చదవండి: జగన్, చంద్రబాబులపై మంచు విష్ణు హాట్ కామెంట్స్..