పితాని కుమారుడు సురేష్ ఎక్కడ…?

ACB Officials Searching for Pitani Suresh : మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు వెంకట సురేష్ హైదరాబాద్‌లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. పితాని మంత్రిగా ఉన్న సమయంలో మందులు కొనుగోలుకు సిఫారసు చేసినట్లుగా గుర్తించారు. ఈ రోజు ఉదయం పితాని పీఏ మురళి మోహన్‌ని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు పితాని కుమారుడు సురేష్. ఇప్పటికే ఏపీ ఏసీబీ బృందం సురేష్ ను అదుపులోకి తీసుకునేందుకు హైదరబాద్ […]

పితాని కుమారుడు సురేష్ ఎక్కడ...?

Updated on: Jul 10, 2020 | 8:43 PM

ACB Officials Searching for Pitani Suresh : మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు వెంకట సురేష్ హైదరాబాద్‌లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. పితాని మంత్రిగా ఉన్న సమయంలో మందులు కొనుగోలుకు సిఫారసు చేసినట్లుగా గుర్తించారు. ఈ రోజు ఉదయం పితాని పీఏ మురళి మోహన్‌ని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు పితాని కుమారుడు సురేష్. ఇప్పటికే ఏపీ ఏసీబీ బృందం సురేష్ ను అదుపులోకి తీసుకునేందుకు హైదరబాద్ కు చేరుకుంది.

ఏనాడు తన తండ్రి పదవిని దుర్వినియోగం చేయలేదని… కేవలం రాజకీయ కక్షతోనే ఇందులో ఇరికించారని కోర్టుకు వివరించినట్లుగా తెలుస్తోంది. తన కార్యదర్శికి ఈ వ్యవహారంలో సంబంధం లేదని… ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు.

అయితే వెంకట సురేష్ తరఫు న్యాయవాది వాదనలను విన్న న్యాయమూర్తి… తీర్పును రిజర్వులో ఉంచారు. కానీ ఇంతలోనే పోలీసులు మాజీ పీఏ మురళిని అరెస్ట్ చేశారు. దీంతో పితాని సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సురేష్ హైదరాబాద్ లో ఉన్నట్లుగా ఏపీ ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు.

Follow Us