ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఎమ్యెల్యేను చంపిన మావోయిస్టులు హతం

| Edited By:

Apr 18, 2019 | 12:56 PM

సార్వత్రిక ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. దంతెవాడ అడవుల్లో జిల్లా రిజర్వు గార్డులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోలు హతం అయ్యారు. పోలింగ్ సందర్భంగా జిల్లా రిజర్వుగార్డులు దంతెవాడలోని ధనికార్కా అడవుల్లో గాలిస్తుండగా.. మావోలు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు వారిపైకి ఎదురుకాల్పులను జరిపారు. దీనిపై దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవ్‌ మాట్లాడుతూ.. ‘‘బీజేపీ ఎమ్మెల్యే మాండవీని చంపేసిన ఇద్దరు మావోయిస్టులు వర్గీస్, లింగాగాలు ఇవాళ జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. […]

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఎమ్యెల్యేను చంపిన మావోయిస్టులు హతం
Follow us on

సార్వత్రిక ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. దంతెవాడ అడవుల్లో జిల్లా రిజర్వు గార్డులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోలు హతం అయ్యారు. పోలింగ్ సందర్భంగా జిల్లా రిజర్వుగార్డులు దంతెవాడలోని ధనికార్కా అడవుల్లో గాలిస్తుండగా.. మావోలు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు వారిపైకి ఎదురుకాల్పులను జరిపారు.

దీనిపై దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవ్‌ మాట్లాడుతూ.. ‘‘బీజేపీ ఎమ్మెల్యే మాండవీని చంపేసిన ఇద్దరు మావోయిస్టులు వర్గీస్, లింగాగాలు ఇవాళ జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. ఈ ఎదురుకాల్పుల్లో మిలిషీయాసభ్యుడు ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలి నుంచి తుపాకులు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాం’’ అంటూ చెప్పారు. కాగా ఈ నెల 9న ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో దంతెవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవీతో పాటు నలుగురు సెక్యురిటీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.