జగన్ తరువాత పార్టీలో.. సీఎం రేసులో బొత్స..?

గత కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వంలో రాజధానిపై రచ్చ జరుగుతోంది. అయితే ఈ తేనేతుట్టెను కదిపింది మాత్రం ఏపీ మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ. ఒకసారి కాదు..నారదుడి కీర్తనలా ఏ మీటింగ్‌లోనైనా, ఏ  ప్రెస్ మీట్ అయినా సరే ఆయన పదే, పదే ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయనకు కోరస్ పాడుతున్నారు.  ఏపీ సీఎం జగన్‌ తరువాత పార్టీలో కీలక నేతగా.. బొత్స సత్యనారాయణ మారారా..! అంటే.. అవుననే సంకేతాలు […]

జగన్ తరువాత పార్టీలో.. సీఎం రేసులో బొత్స..?
Follow us

| Edited By:

Updated on: Sep 03, 2019 | 6:53 PM

గత కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వంలో రాజధానిపై రచ్చ జరుగుతోంది. అయితే ఈ తేనేతుట్టెను కదిపింది మాత్రం ఏపీ మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ. ఒకసారి కాదు..నారదుడి కీర్తనలా ఏ మీటింగ్‌లోనైనా, ఏ  ప్రెస్ మీట్ అయినా సరే ఆయన పదే, పదే ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయనకు కోరస్ పాడుతున్నారు.  ఏపీ సీఎం జగన్‌ తరువాత పార్టీలో కీలక నేతగా.. బొత్స సత్యనారాయణ మారారా..! అంటే.. అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. అంతేగాక.. ఈ మధ్య ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఇష్యూపైన అయినా మీడియాతో మాట్లాడుతోంది కూడా ఆయనే. చెప్పిన విషయాన్నే పదే పదే చెప్తూ.. ప్రస్తుత రాజకీయాల్లో అగ్గిని రాజేస్తున్నారు. దాదాపు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసిన బొత్స.. రాష్ట్ర విభజన, తదితర పరిణామాల అనంతరం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచీ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ వచ్చారు. కాగా.. ఇప్పటివరకు వైసీపీలో సెకండ్ లీడ్ తీసుకుంది ఎంపీ విజయసాయిరెడ్డి. కానీ బొత్స ఇప్పుడు ఆ ప్లేస్‌ను బొత్స రిప్లేస్ చేస్తున్నారు.

కాగా.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తుంటే.. ఏపీ రాజధానిపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు బొత్స. ఏపీ రాజధానిగా ‘అమరావతి’ సరిపోదని.. వేరే ప్రాంతం గురించి సర్వే చేస్తున్నట్లు మీడియా ముందు తెగేసి చెప్పారు. అలాగే.. వర్షాలు, వరదలకు అమరావతి మునిగిపోతుందని.. భూమి లోపలకు కుంచించుకుపోతుందని వ్యాఖ్యానించారు. దీనిపై.. అమరావతి రైతులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజధానిని నిర్మిస్తారని చెప్పి.. భూములు తీసుకుని.. ఇప్పుడు రాజధానిని మార్చితే కుదరంటూ.. నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. బొత్సపై కూడా… ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో కూర్చొని.. మా బతుకుల మీద.. బొత్స మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

కాగా.. ఈ మధ్య అమరావతిలో పర్యటించిన పవన్ కల్యాణ్ కూడా.. బొత్సపై ఘాటు విమర్శలే చేశారు. బొత్స.. సీఎం స్థాయిలో ఉండే.. వ్యక్తి.. అని, అలాంటి వ్యక్తి అమరావతి రాజధాని మార్చడంపై మాట్లాడం చాలా బాధగా.. బాధ్యతారాహిత్యంగా ఉందని పేర్కొన్నారు. నేను రైతులవైపే నిలబడతానని.. అలాగే.. రాజధానిని మార్చడం కూడా.. మంచి పద్ధతి కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్. ఇప్పటికే అమరావతి రాజధానికి సంబంధించి.. గత ప్రభుత్వం చాలా పెట్టుబడి పెట్టిందని.. ఈ సమయంలో.. జగన్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదని పేర్కొన్నారు.

అలాగే.. ఇప్పటికే.. ప్రకాశం జిల్లాల్లోని దొనకొండను.. ఏపీ రాజధానిగా మారుస్తారని కూడా జోరుగా ప్రచారం జరిగింది. దొనకొండలో వైసీపీ నేతలు కూడా.. భూములు కొనుగోలు చేస్తున్నారు. కాగా.. కొద్ది రోజుల క్రితం అక్కడ ఎకరం భూమి కోటి రూపాయలదాకా పలికిందంటే.. నమ్మదక్క విషయమేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

ఏది ఏమైనప్పటికీ.. ఏపీలో రాజధానిపై ఇంతలా రాద్ధాంతం జరుగుతున్నా.. సీఎం జగన్ మాత్రం నోరు మెదపట్లేదు. మరోపక్క బొత్స వ్యాఖ్యలపై కూడా జగన్ ప్రస్తావించట్లేదు. ఈ వ్యూహంలో చూస్తుంటే.. బొత్సకు ఇన్‌డైరెక్ట్‌గా జగన్ సపోర్ట్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. మరి రాజధాని మర్చే విషయంపై జగన్ తొందరగా.. క్లారిటీ ఇస్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు, రాజకీయ నాయకులు కూడా అభిప్రాయ పడుతున్నారు. అయితే.. రాజధానిని మార్చడం కుదరని పని అని.. అక్కడి రైతులు పట్టుబట్టి కుర్చున్నారు.

Botsa Satyanarayana may become second key Person in ysrcp govt

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో