పుల్వామా అమరజవాన్ల కోసం.. ఒక్కచోట చేరిన బాలీవుడ్

Pulwama Martys

ఈ ఏడాది పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు బాలీవుడ్ తారలు నివాళులర్పించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో తూ దేశ్ మేరా అంటూ జవాన్లకు నివాళులర్పించే పాటలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు కనిపించనున్నారు. వారితో అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్, ఆమిర్ ఖాన్, ఐశ్వర్య రాయ్, రణ్‌బీర్ కపూర్, కార్తీక్ ఆర్యన్, టైగర్ ష్రాఫ్ ఉన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పాట పోస్టర్‌‌ను సీర్పీఎఫ్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా ఇందులో భాగమైన నటీనటులందరికీ సీఆర్పీఎఫ్ ప్రత్యేక అభినందనలు తెలిపింది. కాగా మీట్ బ్రోస్ సంగీతం అందించిన ఈ పాటను జావేద్ అలీ, జువిన్ నౌటియల్, షబాబు సక్రిచ కబీర్‌ సింగ్‌లు ఆలపించారు. 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ పాట విడుదల కానున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *